NTV Telugu Site icon

AUS vs PAK: ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మ్యాచ్ మధ్యలో సడన్గా పవర్ కట్.. నిలిచిన డీఆర్ఎస్ సేవలు

Aus Vs Pak

Aus Vs Pak

ప్రపంచకప్ 2023లో భాగంగా నిన్న(శుక్రవారం) బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాలో ఆసీస్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రెండు గంటలపాటు విద్యుత్ పోవడంతో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)పని చేయలేదు. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయాన్ని 17వ ఓవర్ ఆరంభంలోనే స్టేడియం అంపైర్ క్రిస్ బ్రౌన్ ఇరు జట్ల ప్లేయర్లకు తెలిపాడు. దీంతో వారు మైదానంలోని అంపైర్ల నిర్ణయానికే కట్టుబడి ఉండాల్సి వస్తుంది.

Read Also: Nawaz Sharif: నాలుగేళ్ల ప్రవాసం తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన నవాజ్ షరీఫ్..

ఈ విషయంపై కామెంటేటర్ సైమన్ డౌల్ సైతం అనౌన్స్ చేశారు. కొన్ని ఓవర్ల పాటు ఆటగాళ్లు టెక్నాలజీపై ఆధారపడలేరని పేర్కొన్నారు. అయితే చినస్వామి స్టేడియంలో విద్యుత్ పోవడం వల్లే ఇది జరిగినట్టు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తు 18వ ఓవర్ ముగిసిన వెంటనే డీఆర్ఎస్ సిస్టమ్ తిరిగి అందుబాటులోకి వచ్చినట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

Read Also: Leo Producer: ఈ సినిమా వెయ్యి కోట్లని టచ్ చెయ్యదు…

ఇదిలా ఉంటే 17, 18వ ఓవర్ల సమయంలో ఎలాంటి వివాదం ఏర్పడలేదు. ఏదైనా ఎల్బీడబ్ల్యూ లాంటి పరిస్థితులు ఏర్పడి ఉంటే అంపైర్ నిర్ణయంపై సందేహం ఏర్పడి ఉంటే, డీఆర్ఎస్ లేకపోవడం వల్ల అది కాస్తా వివాదమయ్యేది కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే వన్డే ప్రపంచకప్ నిర్వహణ విషయంలో భారత్ పై పాకిస్థాన్ పలు విమర్శలు చేసింది. ఇక నిన్నటి మ్యాచ్ లో గనుక డీఆర్ఎస్ లేని సమయంలో వివాదం ఏర్పడి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో ఎవరూ ఊహించలేరు. దీంతో మరోసారి బీసీసీఐపై ఐసీసీకి పాక్ ఫిర్యాదు చేసేందుకు అవకాశం లభించి ఉండేది.