NTV Telugu Site icon

Sridhar Babu: ఆకస్మిక తనిఖీ.. అధికారులను ఏకిపారేసిన మంత్రి శ్రీధర్ బాబు

It Minister Sridhar Babu

It Minister Sridhar Babu

తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ ను మంత్రి శ్రీధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీన్ని ఆఫీస్ అంటారా..? ఇన్ని రోజులు అధికారులు ఏం చేస్తున్నారు..? అంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ దుస్థితి ఇలా ఉందని అధికారులను నిలదీశారు మంత్రి శ్రీధర్ బాబు. మూడు నెలల్లో ఆఫీస్ మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ పాత ఫైళ్లను డిజిటలైజేషన్ చేసి, ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్‌పై న్యాయమైన రిపోర్ట్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ రిపోర్ట్‌పై ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం జరిగిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రిగా తాను, అధికారులుగా మీరు ఎలాంటి ఆఫీసు వాతావరణంలో కూర్చొని పని చేస్తున్నామో.. ప్రతి ఉద్యోగి కూడా అదే వాతావరణంలో కూర్చొని పని చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు. కాగా.. ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు వరంగల్ లో పర్యటించారు. హనుమకొండలో ఐటీ కంపెనీని ప్రారంభించారు.

Indonesia: గుహలో బయటపడ్డ 51,200 ఏళ్ల పురాతన పెయింటింగ్..

ఇదిలా ఉంటే.. ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యవసాయ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో చాలా మంది ఉద్యోగులు సమయానికి రాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వ్యవసాయశాఖ మంత్రికి ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. నిర్ధేశిత సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవ్వటంతో అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుండి అందరు ఉద్యోగులు సమయానికి హాజరవ్వలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నిన్న ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.