NTV Telugu Site icon

Subramanian Swamy: చంద్రబాబు, పవన్‌.. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు..

Subramanian Swamy

Subramanian Swamy

Subramanian Swamy: టీటీడీ నిర్ణయాలపై, తిరుమల దేవస్థానంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి.. మతపరమైన విషయాల్లో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోరాదు.రాజకీయాలకే పరిమితమవ్వాలని సూచించారు. టీటీడీ చేస్తున్న పలు కార్యక్రమాలపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం తగదన్న ఆయన.. హిందువుల మనోభావాలను చంద్రబాబు, పవన్ కల్యాణ్ దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. న్యాయశాస్త్రంలో నాకున్న అనుభవం, పరిజ్ఞానంతో సహాయం చేయాలని టీటీడీ అభ్యర్ధించింది.. ఒక్క పైసా తీసుకోకుండా టీటీడీకి తాను సహాయం చేస్తున్నానని తెలిపారు.

Read Also: Jammu& Kashmir: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు వలస కార్మికులను కాల్చి చంపిన ఉగ్రవాదులు..

ఇక, అబద్దాలను ప్రచురిస్తున్న ఆ పత్రికపై పరువునష్టం పిటిషన్‌ వేయనున్నట్టు తెలిపారు సుబ్రమణ్యస్వామి.. నేను వ్యక్తిగత హోదాలో న్యాయపోరాటం చేస్తున్నానన్న ఆయన…”శ్రీ వాణి” ట్రస్ట్ కింద వసూలు చేస్తున్న నిధులను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దోచుకుంటున్నారన్న ఆరోపణలు వాస్తవం కాదని కొట్టిపారేశారు. త్వరలో “శ్రీవాణి ట్రస్ట్” టికెట్ ద్వారా దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాని వెల్లడించారు. “శ్రీవాణి ట్రస్ట్” దర్శనం రసీదు సరైనదే అని ప్రతిఒక్కరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను.. అందుకే శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్‌ ద్వారా దర్శనాని వెళ్తానని పేర్కొన్నారు.. ఇక, టీటీడీ, శ్రీవాణి ట్రస్ట్‌ను అప్రతిష్టపాలు చేసే చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను గట్టిగా ఖండిస్తున్నానని తెలిపారు కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి.