ClassRoom Tragedy : ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కూల్ డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగిన చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. ఓ వైపు పాఠశాలలో తరగతులు జరుగుతుండగా నాలుగైదు తరగతులు చదువుతున్న ముగ్గురు బాలికలు పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెరగూడెంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిందీ ఘటన.
Read Also: Fire in New Secretariat: తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
నాలుగో తరగతి చదువుతున్న ఆరెప్లల్లి అక్షర (9), సాదు అఖిల (9), ఐదో తరగతి చదువుతున్న సాదు ఐశ్వర్య (10) ఏడుస్తుండడంతో గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని టీచర్ కు చెప్పారు. దీంతో వారు ఎందుకేడుస్తున్నారని ప్రశ్నించగా అక్షర బ్యాగులో ఉన్న తెల్లని డ్రింకును తాగినట్టు చెప్పారు. దీంతో అదేంటని పరిశీలించగా పురుగుల మందు వాసన రావడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయుడు రాజేశ్ కుమార్ తల్లిదండ్రులకు సమాచారమిచ్చి వారిని బైక్‌పై ములుగు ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు వెంటనే వారికి చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా, బాలిక స్కూలు బ్యాగులోకి పురుగులు మందు ఎలా వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
Read Also: Telangana Budget : నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనున్న గవర్నర్