జీవో 46ను రద్దు చేయాలని, మళ్ళీ పాత పద్ధతిలోనే పోలీస్ టీఎస్ఎస్పీ, ఐటీ, కమ్యూనికేషన్ నియామకాలు చేపట్టాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు అర్ధనగ్న ప్రదర్శనతో మోకాళ్ళపై నడిచారు. పోలీసు బోర్డ్ నియామకం ప్రకారం క్వాలిఫై అయిన మాకు ఈ జీవో వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో ప్రకారం ఫలితాలు ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని అవకాశం ఉంది.
Also Read : Weight Loss: బరువుతో ఇబ్బంది పడుతున్నారా.. తగ్గడానికి ఇలా చేయండి..!
కాబట్టి ఈ జీవోను తెలంగాణ ముఖ్యమంత్రి రద్దు చేయాలని కోరారు. ఈ జీవో రద్దు కొరకు వివిధ దశల్లో ఉద్యమిస్తామని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 30కి పైగా మార్కులు సాధిస్తే వచ్చే ఉద్యోగం.. జిల్లాల గ్రామీణ అభ్యర్థులకు 130పైగా మార్కులు తెచ్చుకున్నా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 46 రద్దు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గానికి 100 మంది చొప్పున పోటీ చేస్తామని హెచ్చరించారు. వీరికి తెలంగాణ ఉద్యమ కారుడు చెరుకు సుధాకర్ మద్దతు తెలిపారు.
Also Read : Muraleedharan: ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం చూస్తున్నారు
