NTV Telugu Site icon

Students Protest: కోఠి మహిళా కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థినులు

Students Protest

Students Protest

Students Protest: హైదరాబాద్‌లోని కోఠి మహిళా కళాశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిందని.. కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయంగా పేరు మార్చిందన్నారు. తమ డిగ్రీ పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంతవరకు యూజీసీలో చేర్చకపోవడం వల్ల తమకు ఏ ప్రాతిపదికన సర్టిఫికెట్ ఇస్తారని ఆందోళన చేపట్టారు. తమ భవిష్యత్తు అయోమయంగా మారిందని విద్యార్థినులు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకొని , యూజీసీలో చేర్చాలని విద్యార్థినులు విజ్ఞప్తి చేశారు.

Read Also: Real Estate: హైదరాబాద్‌లో వరుసగా మూతపడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థలు

 

Show comments