Site icon NTV Telugu

Vizag Crime: విశాఖలో దారుణం.. లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య

Crime

Crime

Vizag Crime: విశాఖపట్నంలో దారుణం జరిగింది.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన లెక్చరర్లే విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని.. న్యూడ్‌ ఫొటోలు తీసి శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపులు తాళలేక డిప్లొమా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటున్నారు.. న్యూడ్ ఫొటోలు తీసిన ఓ ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యం.. లైంగిక వేధింపులకి పాల్పడడంతో.. విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.. చదువు చెప్పాల్సిన గురువు జ్ఞానం వదిలి అనేక మంది విద్యార్థినులను ఇలాగే వేధిస్తున్నారట.. తనతో పాటు అనేక మంది న్యూడ్ ఫోటోలు పెట్టుకొని.. తోటి విద్యార్థులతో కలిసి బెదిరిస్తున్నారంటూ మెసేజ్‌ పెట్టిన విద్యార్థి.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది.. నిన్న రాత్రి తన తండ్రికి తన బాధని మెసేజ్ రూపంలో చేరవేసిన ఆ విద్యార్థిని.. ఆ తర్వాత తన ప్రాణాలు తీసుకుంది.. మా అమ్మాయి లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని ఆ విద్యార్థిని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. సదరు కాలేజీపై చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలంటున్నారు.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Panathala Suresh: చంద్రబాబుపై మండిపడ్డ బీజేపీ అసమ్మతి నేత.. ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారు..!

Exit mobile version