Brutally Thrashing : ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ విద్యార్థిని కర్రలతో దారుణంగా కొట్టిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను భీమవరం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వారిపై శుక్రవారం నాడు 34 ఐపీసీ 384,324,342,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రేమ విషయంలో అంకిత్ అనే వ్యక్తిని కొట్టినట్లు అరెస్టయిన విద్యార్థులు పోలీసులకు వెల్లడించారు. నిందితుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి అంకిత్‌ను గదిలో బంధించి క్రూరంగా హింసించాడు. కాగా, ఈ మొత్తం ఎపిసోడ్‌ను మరో విద్యార్థి వీడియో తీశాడు.
Also Read : Minister Roja : కళ్ళు ఉన్న కబోది చంద్రబాబు నాయుడు
భీమవరం టూటౌన్ ఇన్ స్పెక్టర్ బి.కృష్ణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ.. ఐదుగురు విద్యార్థులు ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగా వీరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. నరసన్నపేటకు చెందిన అంకిత్ కు ప్రవీణ్, ప్రేమ్ కుమార్, స్వరూప్, నీరజ్ అనే నలుగురు విద్యార్థులకు వాగ్వాదం జరిగింది. దీంతో.. నలుగురు విద్యార్థులు అంకిత్‌పై కర్రలతో పాశవికంగా దాడి చేయడంతో అంకిత్ శరీరమంతా గాయాలయ్యాయి. బాధితుడు భీమవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పటికే కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను సస్పెండ్ చేశారు.