NTV Telugu Site icon

Cyclone Biparjoy: తీవ్రమైన బిపర్ జోయ్ తుపాన్.. రానున్న 24గంటలు జాగ్రత్త

Biparjoy

Biparjoy

Cyclone Biparjoy: రానున్న 24 గంటల్లో బిపర్ జోయ్ తుపాను మరింత ప్రమాదకరంగా మారుతుందని అంచనా. అరేబియా సముద్రం నుంచి ఉద్భవించిన తుపాను నెమ్మదిగా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది. దీని ప్రమాదం గుజరాత్‌ను చుట్టుముడుతోంది. బిపర్ జోయ్ ఆదివారం లేదా సోమవారం నాటికి గుజరాత్ దాటనుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. ఈ సమయంలో గంటకు 100-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

బిపర్‌జోయ్ కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్ సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. బిపార్జోయ్ తుఫాను కారణంగా గుజరాత్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అన్ని పోర్టులను అప్రమత్తం చేశారు. కేరళలోని ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

Read Also:Karnataka : భర్తపై భార్య అత్యాచారం కేసుపై స్టే విధించిన హైకోర్టు..

బిపర్‌జోయ్ తుపాను కారణంగా రానున్న 3-4 రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుజరాత్‌లోని అన్ని బృందాలను అప్రమత్తం చేశారు. దీంతో పాటు తీర ప్రాంతాల్లోని గ్రామాలను కూడా అప్రమత్తం చేశారు. పరిస్థితి తీవ్రంగా మారితే ప్రజలను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించవచ్చు. గుజరాత్, డామన్ డయ్యూ మత్స్యకారులు, నావికులు జాగ్రత్తలు తీసుకోవాలని ఇండియన్ కోస్ట్ గార్డ్ సూచించింది. ప్రస్తుతం ముంబైకి దక్షిణంగా 600 కిలోమీటర్లు, పోర్‌బందర్‌కు నైరుతి దిశలో 540 కిలోమీటర్లు, కరాచీకి దక్షిణంగా 840 కిలోమీటర్ల దూరంలో బిపర్‌జోయ్ తుఫాను కేంద్రీకృతమై ఉందని IMD తెలిపింది. ఇది మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. జూన్ 15 సాయంత్రం నాటికి ఇది పాకిస్థాన్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

గుజరాత్‌లోని సముద్ర ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పోర్‌బందర్, జామ్‌నగర్, ద్వారకలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. సౌరాష్ట్ర, కచ్ తీరాలకు IMD అలర్ట్ ప్రకటించింది. మత్స్యకారులు జూన్ 13 వరకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. మోచా తుపాను తర్వాత, ఈ మరో తుఫాను విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. పశ్చిమ బెంగాల్, శ్రీలంకలో మోచా చాలా విధ్వంసం సృష్టించింది.

Read Also:Kshama Bindu: తనను తానే పెళ్లి చేసుకున్న క్షమా బిందు .. గ్రాండ్ గా ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్..వీడియో వైరల్