Viral Video: వీడియో.. కిడ్నాపర్ల బారి నుంచి బాలికను కాపాడిన వీధి కుక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Street Dog Saved Girl From Kidnappers: కుక్కలు విశ్వాసానికి మారుపేరు. వాటికి కొంచెం సాయం చేస్తే చాలు మనల్ని గుర్తుపెట్టుకొని ఎంతో నమ్మకంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో కుక్కలు మనుషులను కాపాడినట్లు చూస్తూ ఉంటాం. తాజాగా ఓ వీధి కుక్క స్కూల్ నుంచి వస్తున్న బాలికను కిడ్నాపర్ల బారి నుంచి కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైలర్ అవుతుంది.
వీడియో ప్రకారం ఓ బాలిక స్కూల్ నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది. రెడ్ కలర్ కోటు వేసుకున్న ఆ బాలిక రోడ్డుపై ఒంటరిగా ఉంటుంది. ఇంతలో వెనుక నుంచి ఒక కారు వస్తుంది. ఆ బాలిక వద్దకు రాగానే ఆ కారు నెమ్మదిగా ఆగుతుంది. ఎవరో దాని డోర్ ను కారు లోపలి నుంచి నెమ్మదిగా తెరుస్తారు. బాలిక ఇదంతా చూసి కంగారుగా వెనకకు చిన్నచిన్నగా నడుస్తూ ఉంటుంది. అంతలో ఓ వీధి కుక్క వేగంగా పరిగెత్తూకుంటూ వచ్చి వారిపై అరుస్తుంది. దీంతో భయపడిపోయిన కిడ్నాపర్ లు అక్కడి నుంచి పారిపోయారు. ఆ బాలిక పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుక్కకు తెలియకుండానే తన వీధులోకి కొత్త వ్యక్తులు రావడంతో వారిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దాంతో వారు ఆ బాలికను వదిలేసి వెళ్లిపోయారు. తెలిసి చేసినా, తెలియక చేసినా కుక్క వల్ల బాలికకు మంచి జరిగింది.
Also Read
Also Read: Uttar Pradesh: వీడు మాములోడు కాదు.. ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సినిమా చూపించాడుగా
ఈ మొత్తం ఘటన అక్కడ ఉన్న సీసీ టీవీ కెమెారాలో రికార్డ్ అయ్యింది. ఈ కుక్క ఒక పెద్ద బోన్ కొనియాలి అని క్యాప్షన్ జోడించి దీనిని సీసీటీవీ ఇడియట్స్ అనే యూజర్ ఎక్స్ (ట్వీటర్) ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే రెండు కోట్ల మందికి పైగా వీక్షించారు. లక్షకు పైగా లైక్ లు వచ్చాయి. ఈ వీడియో చూసిన వారు పెంపుడు కుక్కల వల్లే కాదు వీధి కుక్కల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. సూపర్ డాగ్ అంటూ మరికొంతమంది కొనియాడుతున్నారు. ఇక కుక్కకు మంచి బోన్ కొనియాలని సూచిస్తున్నారు. ఆ బాలిక ఎవరో తెలియకపోయినా ఆమెను కుక్క కాపాడిందంటూ నెటిజన్లు ఆ కుక్కను మెచ్చుకుంటున్నారు.
Buy that doggie a big ass t-bone 👍 pic.twitter.com/zIV5agDNkB
— Pepe Meme (@pepe_fgm) August 26, 2023
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
-
US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!