Stree Summit 2.0: ఘనంగా ప్రారంభమైన స్త్రీ సమ్మిట్ 2.0
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stree Summit 2.0: హైదరాబాద్ నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్ వేదికగా స్త్రీ సమ్మిట్ 2.0 – 2025 కార్యక్రమం ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ అవగాహన సదస్సులో మహిళల భద్రత, చిన్నపిల్లల రక్షణ, సైబర్ సెక్యూరిటీ, అర్బన్ ఎన్విరాన్మెంట్, ఎమర్జెన్సీ ప్రిపేర్డ్‌నెస్ వంటి అంశాలపై చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన 500 మందికి పైగా మహిళలు, యువతులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
ఈ సందర్బంగా.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం – ప్రైవేట్ భాగస్వామ్యం ఆధారంగా ప్రజల కోసం పనిచేసే వేదిక HCSC అని తెలిపారు. ప్రజల భద్రత కోసం ప్రైవేట్ కంపెనీల సహకారం తీసుకుంటున్నామని.. కంపెనీల యజమానులు, సీఈఓలు HCSCలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాట్లు తెలిపారు. అలాగే.. మహిళల భద్రత కోసం సిటీ పోలీస్ – HCSC కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని.. గర్ల్ చైల్డ్ రేషియో ప్రస్తుతం 942గా ఉందని తెలిపారు. ఎక్కడెక్కడ ఈవెంట్లు జరుగుతున్నా, అక్కడ షీ టీమ్స్ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. గత ఏడాది మహిళలపై, చిన్నారులపై నేరాలకు పాల్పడిన అనేక మంది నిందితులను జైలుకు పంపించామని తెలిపారు.
Also Read
- Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
- Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
- Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
- Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
హైదరాబాద్ పోలీసు పరిధిలో ఏడు ఉమెన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, రాత్రి వేళల్లో కూడా ఉమెన్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారన్నారు. మహిళలు భయపడకుండా జీవించేందుకు అనువైన వాతావరణం కల్పించడమే మా లక్ష్యం అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Jharkhand: జార్ఖండ్‌లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
-
Rashid Khan Creates ODI History: వన్డేల్లో అరుదైన రికార్డు.. తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్..
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
Bengaluru: బాత్రూమ్లో మహిళ అస్థిపంజరం లభ్యం.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Dharmendrasinh Jadeja: 609 వికెట్ల వీరుడు.. టీమ్ ఇండియాలో చోటు లేదు.. ధర్మేంద్రసింగ్ జడేజా కథ ఇదే!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!