NTV Telugu Site icon

Stray Dogs : వీధి కుక్కల స్వైర విహారం.. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్‌పై దాడి..

Dog

Dog

వీధి కుక్క దాడిలో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గాయపడిన ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మట్టవాడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీను బట్టల బజార్లో విధులు నిర్వహిస్తుండగా అటుగా వెళుతున్న ఓ వృద్ధురాలిపై కుక్కలు దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీను పై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది గాయపడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీను తోపాటు వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే అనేకసార్లు కుక్కల దాడి ఘటన జరుగుతున్న నిద్రమత్తులో ఉన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రేటర్ ప్రజలు.

Also Read : Kottu Satyanarayana: పవన్‌ని అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు.. సెక్షన్ 30 కొత్తది కాదు..!

ఇదిలా ఉంటే.. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో ఓ ఫంక్షన్ హాల్ బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడు కేకలు వేయడంతో.. గమనించిన స్థానికులు వీధి కుక్కలను తరిమికొట్టారు. అయితే.. ఆ చిన్నారిని పొట్ట భాగంలో దాడి చేసి బాలున్ని లాక్కెళ్లేందుకు వీధి కుక్కలు ప్రయత్నించటంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పొట్ట భాగంతో పాటు తలకు కూడా గాయాలవడంతో.. వెంటనే బాలుడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read : TCL T6G QLED 4K TV: సినిమా హాల్ మాదిరి పెద్ద స్క్రీన్ స్మార్ట్‌ టీవీ.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!