Site icon NTV Telugu

Strange Death: గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి!

Boiled Egg Dead

Boiled Egg Dead

Kanchipuram Man Dies After Choking on Boiled Egg: ‘మృత్యువు’ ఎవరిని ఎప్పుడు ఎలా బలితీసుకుంటుందో చెప్పలేం. అప్పటివరకూ మన పక్కన ఉన్నవారే.. ఊహించని విధంగా చనిపోతుంటారు. ఊహించని రీతిలో రోడ్డు ప్రమాదం జరగడం, ఉన్నపలంగా గుండెపోటు రావడం, గొంతులో మటన్ ముక్క ఇరుక్కుని పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా అలాంటి విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో చోటుచేసుకుంది. గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని ఓ వ్యక్తి మృతి చెందాడు.

Also Read: US Open 2025: ఔరా.. వీనస్‌ విలియమ్స్‌! 45 ఏళ్ల వయసులోనూ

రవి (55) అనే వ్యక్తి కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్‌ పంచాయతీ యూనియన్‌ మలైయాంగుళం గ్రామంలో నివసిస్తున్నాడు. రవికి భార్య వలర్మతి (45), కుమార్తె స్నేహ (24) ఉన్నారు. అతడు భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం రాత్రి రవి భోజనం చేస్తూ.. ఉడకబెట్టిన కోడిగుడ్డును నమలకుండా అలానే మింగేశాడు. గుడ్డు గొంతులో చిక్కుకోవడంతో ఊపిరాడక విలవిలల్లాడాడు. వెంటనే కుటుంబ సభ్యులు పడూర్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అయితే రవి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Exit mobile version