NTV Telugu Site icon

Stormy Daniels: కోర్టు ముందు ట్రంప్‌తో రిలేషన్‌షిప్ గురించి చెప్పిన అడల్ట్ స్టార్‌

Storny Daniels

Storny Daniels

Stormy Daniels: హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా అడల్ట్ ఫిల్మ్ స్టార్ స్టార్మీ డేనియల్స్ వాంగ్మూలం ఇచ్చారు. డేనియల్స్ మంగళవారం కోర్టుకు హాజరై, 2006లో అమెరికాలోని లేక్ తాహోలోని హోటల్‌లో ట్రంప్‌తో సెక్స్‌లో పాల్గొన్నానని.. ఆమె అందుకున్న చెల్లింపు గురించి చెప్పారు. డేనియల్స్‌తో లైంగిక సంబంధాలను డోనాల్డ్ ట్రంప్ ఖండించారు. అదే సమయంలో, 2016లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండటానికి ట్రంప్ డేనియల్స్‌కు డబ్బు ఇచ్చారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ కేసులో ఆదేశాలను ఉల్లంఘించినందుకు ట్రంప్‌కు 10,000 డాలర్ల జరిమానా కూడా విధించారు. 2006 లేక్ తాహో సెలబ్రిటీ గోల్ఫ్ ఔటింగ్‌లో ట్రంప్‌ను తాను మొదటిసారి కలిశానని డేనియల్స్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దీని తరువాత, ట్రంప్ ఆమెను తన విలాసవంతమైన హోటల్ సూట్‌లో విందుకు ఆహ్వానించారని.. ట్రంప్ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు ఆమె వెల్లడించారు. ట్రంప్‌ను కలిసినప్పుడు సిల్క్ పైజామా ధరించి ఉన్నారని డేనియల్స్ తెలిపారు. ఓ మ్యాగజైన్‌తో ట్రంప్ తనను సరదాగా కొట్టారని డేనియల్స్ చెప్పారు.

Read Also: North Korea: ఉత్తర కొరియాలో విషాద ఛాయలు.. కిమ్ కీ నామ్ మృతి..

మీకు లైంగిక వ్యాధి ఏమైనా ఉందా అని ట్రంప్ ప్రశ్నించారు…
అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, ఆమె లైంగికంగా సంక్రమించే వ్యాధుల (STDs) కోసం టెస్టులు చేయించుకున్నారా.. అని ట్రంప్ ఆమెను అడిగారని డేనియల్స్ చెప్పారు. స్టార్మీ తన వాంగ్మూలంలో, ట్రంప్‌తో సన్నిహిత సమావేశాన్ని వివరించింది, ట్రంప్ సూట్‌లోకి వచ్చినప్పుడు, ఆమె తన బాక్సర్లు, టీ-షర్ట్‌లో బెడ్‌పై ఉన్నానని చెప్పింది. ట్రంప్ తనతో కండోమ్ లేకుండా సెక్స్ చేశాడని అడల్ట్ స్టార్ తన వాంగ్మూలంలో పేర్కొంది. మరోసారి కలుస్తానని ట్రంప్ హామీ ఇస్తూనే తనకు వీడ్కోలు పలికారని డేనియల్స్ తెలిపారు. 2007 వేసవిలో కలిసి నిద్రించడానికి ట్రంప్ ఆమెను లాస్ ఏంజెల్స్‌కు తిరిగి ఆహ్వానించారని, అయితే ఆ సమయంలో ఆమె రుతుక్రమంలో ఉందని డేనియల్స్ చెప్పారు.

వయోజన సినీ నటి స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లించారనే ఆరోపణలపై డొనాల్డ్ ట్రంప్‌పై కేసు నమోదైంది. తనకు, ట్రంప్‌కు లైంగిక సంబంధాలు ఉన్నాయని డేనియల్స్ పేర్కొన్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో తన లైంగిక సంబంధాన్ని వెల్లడించనందుకు డొనాల్డ్ ట్రంప్ తన లాయర్ ద్వారా డేనియల్స్‌కు 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని ఆరోపించారు. మరోవైపు డేనియల్స్‌తో తనకు సంబంధం లేదని ట్రంప్ కొట్టిపారేశారు. 45 ఏళ్ల అడల్ట్ ఫిల్మ్ స్టార్ డేనియల్స్ పోర్స్ ఇండస్ట్రీలో సుపరిచితమైన పేరు. ఆమె చేసిన కృషికి ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. హాలీవుడ్ చిత్రాలకు కూడా పనిచేశారు. ఆమె చేసిన హాలీవుడ్ చిత్రాలలో ది 40-ఇయర్-ఓల్డ్ వర్జిన్, నేక్డ్‌ అప్ ఉన్నాయి.