Stone Attack on CM Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో పురోగతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stone Attack on CM Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. సతీష్, దుర్గారావు ఇద్దరిని కూడా నేడు అరెస్ట్ చేయనున్నారు. ఈ కేసులో ఏ1గా రాయితో దాడి చేసిన సతీష్, ఏ2గా దుర్గారావు పై కేసు నమోదైంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీలో దుర్గారావు యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు. దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. సిమెంట్ రాయి ముక్కతో బస్సుకు 20 అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి సతీష్ దాడి చేసినట్లు తెలిసింది. రాయితో దాడి చేసిన తర్వాత సతీష్, దుర్గారావులు తమకు ఇళ్లకు వెళ్లిపోయినట్లు విచారణలో తెలిసింది. సతీష్‌తో పాటు అదుపులోకి తీసుకున్న మిగతా నలుగురి నుంచి స్టేట్ మెంట్ తీసుకుని పోలీసులు వారిని విడుదల చేయనున్నారు.
Read Also: Janasena: రాజోలులో పవన్‌కు ఎదురుదెబ్బ.. జనసేనకు కీలక నేత గుడ్‌బై
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఏప్రిల్ 13న రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. మేమంతా సిద్దం పేరుతో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విజయవాడలో మేమంతా సిద్దం బస్సు యాత్ర సాగుతున్న సమయంలో సీఎం జగన్‌పై రాళ్లతో దాడి జరిగింది. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో జనాల్లో నుంచి విసిరిన రాయి వచ్చి జగన్ తలకు బలంగా తాకింది. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి కనుబొమ్మ పైభాగంలో గాయమైంది. అలాగే సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి కంటికి కూడా గాయం అయింది. ఈ ఘటన జగన్ భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. జగన్‌కు బస్సులోనే వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అయితే ప్రథమ చికిత్స అనంతరం సీఎం జగన్.. మేమంతా సిద్దం బస్సు యాత్రను కొనసాగించారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!