Site icon NTV Telugu

Stock Market: వరుస నష్టాలు.. కారణమిదే..!

Sm

Sm

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడు రోజుల నుంచి నష్టాల్లో ముగుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు కారణంగా బుధవారం సూచీలపై ప్రభావం చూపించింది. సెన్సెక్స్ 667 పాయింట్లు నష్టపోయి 74,502 దగ్గర ముగియగా.. నిఫ్టీ 183 పాయింట్లు నష్టపోయి 22,700 దగ్గర ముగిసింది.

ఇది కూడా చదవండి: Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్..

సెన్సెక్స్‌ సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభాల్లో కొనసాగగా.. ఎం అండ్‌ ఎం, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఎల్‌ అండ్‌ టీ షేర్లు నష్టాల్లో కొనసాగాయి.

ఇది కూడా చదవండి: Phone Tapping : ప్రణీత్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు

వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు భావించారు. కానీ ఆ ఎఫెక్ట్ మాత్రం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపించడం లేదు. మోడీ సర్కార్ మరోసారి రాబోతుందన్న సంకేతాలతో సూచీలు దూసుకుపోతాని అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ ముందు.. ముందు ఎలా ఉంటుందో చూడాలి.

ఇది కూడా చదవండి: Mamata Banerjee: ‘‘మోడీకి గుడి కట్టించి, ధోక్లా ప్రసాదంగా ఇస్తాం’’.. ప్రధానిపై మమత సెటైర్లు..

Exit mobile version