Site icon NTV Telugu

Stock Market Opening: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

Stock Markets

Stock Markets

Stock Market Opening: రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానానికి ముందు స్టాక్ మార్కెట్ నేడు నేల చూపు చూస్తోంది. దీంతో పాటు విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఇవాళ పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వనున్నారు. ఈ వార్తల ప్రభావం మార్కెట్‌పై కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్-నిఫ్టీ నష్టాల మధ్య ట్రేడ్ అవుతోంది.

Read Also:Mancherial: ప్రతిపక్షాల స్వ’రక్షణ’ కోసమే మాతా, శిశు సంరక్షణ కేంద్రంపై ఆరోపణలు: బీఆర్ఎస్

నేడు స్టాక్ మార్కెట్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 50.42 పాయింట్ల పతనంతో 65,945 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది కాకుండా ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్ల పతనంతో 19605 స్థాయి వద్ద ప్రారంభమైంది.

Read Also:Sajjanar: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.. ట్వీట్ చేసిన ఎండీ సజ్జనార్

సెన్సెక్స్, నిఫ్టీ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్‌లోని 30 స్టాక్స్‌లో కేవలం 5 స్టాక్‌లు మాత్రమే బూమ్ చూస్తున్నాయి. మిగిలిన దాదాపు 25 స్టాక్‌లు నష్టాలను చవిచూస్తున్నాయి. నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 16 లాభాల బాటా పడుతుండగా.. మరో 34 స్టాక్‌లు క్షీణతతో ట్రేడవుతున్నాయి. ఎన్‌టిపిసి, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, మారుతీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఎస్‌బిఐ, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్‌ల పేర్లు సెన్సెక్స్ పెరుగుతున్న స్టాక్‌లలో ఉన్నాయి.

Exit mobile version