NTV Telugu Site icon

Stock Market: మూడు రోజుల్లో 1700పాయింట్లు నష్టం.. దాదాపు రూ.6లక్షల కోట్ల సంపద ఆవిరి

Stock Markets

Stock Markets

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ గత మూడు రోజులుగా డౌన్‌వర్డ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ మూడు రోజుల్లో దాదాపు 1700పాయింట్లు నష్టపోయింది. గురువారం ఒక్కరోజే సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా పడిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ 0.80 శాతానికి పైగా క్షీణతతో నేడు ముగిశాయి. బ్యాంక్, ఆటో, ఫార్మా రంగాల షేర్లు భారీ పతనంతో మార్కెట్‌ను పతనమయ్యాయి. గురువారం మార్కెట్ ముగింపులో బీఎస్ఈ సెన్సెక్స్ 570.60 పాయింట్లు లేదా 0.85 శాతం క్షీణించి, 66,230 స్థాయి వద్ద ముగిసింది. ఇది కాకుండా ఎన్ఎస్ఈ నిఫ్టీ 159.05 పాయింట్లు లేదా 0.80 శాతం క్షీణతతో 19,742 స్థాయి వద్ద ముగిసింది. దీంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సంపద దాదాపు 5.5లక్షల కోట్లు ఆవిరైంది.

బ్యాంక్ నిఫ్టీ గురువారం 760.75 పాయింట్లు లేదా 1.68 శాతం క్షీణతతో 44,623.85 స్థాయి వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌ షేర్లు క్షీణించడం స్టాక్‌ మార్కెట్‌ పతనానికి దోహదపడింది. ఇది కాకుండా ఆటో, ఫార్మా స్టాక్స్ కూడా మార్కెట్ క్షీణతలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.

Read Also:Faria Abdullah : స్లీవ్ లెస్ టాప్ లో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..

సెన్సెక్స్ షేర్ల పరిస్థితి ఎలా ఉంది?
సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో కేవలం 6 స్టాక్‌లు మాత్రమే లాభాలతో ముగియగా, అందులోని 24 స్టాక్‌లు భారీ పతనంతో ముగిశాయి. అతిపెద్ద పతనమైన స్టాక్‌లలో మహీంద్రా అండ్ మహీంద్రా 3.08 శాతం క్షీణతను నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ 2.81 శాతం, ఎస్‌బీఐ 2.12 శాతం పతనంతో ముగిశాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో 2.02 శాతం బలహీనత, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 1.89 శాతం నష్టపోయాయి.

నిఫ్టీ షేర్ల చిత్రం ఎలా ఉంది?
గురువారం ట్రేడింగ్ లో 50 నిఫ్టీ స్టాక్‌లలో 34 క్షీణతతో ముగియగా, 16 స్టాక్‌లు మాత్రమే నష్టాలతో ముగిశాయి. ఇందులో కొంత పెరుగుదల నమోదైంది. నిఫ్టీ టాప్ లూజర్లలో ఎం అండ్ ఎం 2.88 శాతం నష్టంతో ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ 2.81 శాతం నష్టంతో, సిప్లా 2.47 శాతం బలహీనతతో ముగిశాయి. ఎస్‌బీఐ 2.20 శాతం భారీ పతనంతో, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2.04 శాతం భారీ పతనంతో ముగిశాయి.

Read Also:Whatsapp New Features: వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్స్..ఆన్లైన్ ఆర్డర్స్ తో పాటు..

Show comments