Site icon NTV Telugu

Steve Smith History: రికార్డులు తిరగరాసిన స్టీవ్ స్మిత్.. హాబ్స్‌, సచిన్, ద్రవిడ్ రికార్డ్స్ బ్రేక్!

Steve Smith History

Steve Smith History

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదవ, చివరి యాషెస్ టెస్ట్‌లో స్టీవ్ స్మిత్ సెంచరీ బాదాడు. ఇది అతడికి 37వ టెస్ట్ సెంచరీ కాగా.. యాషెస్ సిరీస్‌లో 13వ శతకం. దాంతో ఇంగ్లాండ్ లెజెండ్ బ్యాటర్ జాక్ హాబ్స్‌ను అధిగమించి.. యాషెస్ చరిత్రలో రెండవ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా స్మిత్ నిలిచాడు. ఈ జాబితాలో లెజెండరీ ఆటగాడు డాన్ బ్రాడ్‌మాన్ (19 సెంచరీలు) మొదటి స్థానంలో ఉన్నాడు. స్టీవ్ వా (10), వాలీ హామండ్ (9), డేవిడ్ గోవర్ (9) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బ్రాడ్‌మాన్‌ను అధిగమించాలంటే స్మిత్ ఇంకా యాషెస్‌లో 6 శతకాలు చేయాల్సి ఉంది. స్మిత్ ప్రస్తుత ఫామ్, వయసు పరంగా చూస్తే.. ఈ రికార్డు కష్టమే అని చెప్పాలి.

యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా స్టీవ్ స్మిత్ మరో రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇంగ్లీష్ లెజెండ్ జాక్ హాబ్స్ (3,636 పరుగులు)ను అధిగమించాడు. యాషెస్‌లో ఇప్పటివరకు స్మిత్ 3682 రన్స్ చేశాడు. ఈ జాబితాలో సర్ డాన్ బ్రాడ్‌మాన్ (5,028 పరుగులు) కంటే స్మిత్ వెనుకబడి ఉన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రాహుల్ ద్రవిడ్‌ను స్మిత్ అధిగమించాడు. భారత మాజీ కెప్టెన్ ద్రవిడ్ తన టెస్ట్ కెరీర్‌లో 36 సెంచరీలు చేశాడు. స్మిత్ ఖాతాలో ప్రస్తుతం 37 టెస్ట్ శతకాలు ఉన్నాయి.

స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా 18వ టెస్ట్ సెంచరీ చేశాడు. గ్రేమ్ స్మిత్ (25), విరాట్ కోహ్లీ (20), రికీ పాంటింగ్ (19) మాత్రమే అతని కంటే ఎక్కువ టెస్ట్ సెంచరీలు బాదారు. 68 కంటే ఎక్కువ సగటుతో టెస్ట్ ఫార్మాట్‌లో స్మిత్ కంటే ఎక్కువ పరుగులు చేసిన మరో కెప్టెన్ లేడు. గత సంవత్సరం స్మిత్ 10,000 టెస్ట్ పరుగులు చేసిన నాల్గవ ఆస్ట్రేలియన్‌గా చరిత్ర సృష్టించాడు. స్మిత్ 219 ఇన్నింగ్స్‌లలో 37వ టెస్ట్ సెంచరీని బాదాడు. భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 220 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. దాంతో సచిన్ రికార్డు కూడా బ్రేక్ అయింది.

Also Read: Flipkart Sale 2026: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే ఆఫర్.. అతి తక్కువ ధరకే ఐఫోన్ 16, గెలాక్సీ ఎస్‌24!

యాషెస్‌లో అత్యధిక సెంచరీలు:
# 19 – డాన్ బ్రాడ్‌మాన్,
# 13 – స్టీవ్ స్మిత్
# 12 – జాక్ హాబ్స్
# 10 – స్టీవ్ వా
# 9 – వాలీ హామండ్
# 9 – డేవిడ్ గోవర్

యాషెస్‌లో అత్యధిక పరుగులు:
# 5028 – డాన్ బ్రాడ్‌మాన్
# 3682 – స్టీవ్ స్మిత్
3 3636 – జాక్ హాబ్స్
# 3222 – అలన్ బోర్డర్
# 3173 – స్టీవ్ వా
# 3037 – డేవిడ్ గోవర్

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు:
# 51 – సచిన్ టెండూల్కర్
# 45 – జాక్వెస్ కల్లిస్
# 41 – రికీ పాంటింగ్
# 41 – జో రూట్
# 38 – కుమార్ సంగక్కర
# 37 – స్టీవ్ స్మిత్
# 36 – రాహుల్ ద్రవిడ్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు:
# 6707- సచిన్ టెండూల్కర్ vs ఆస్ట్రేలియా
# 5551- విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియా
# 5108- సచిన్ టెండూల్కర్ vs శ్రీలంక
# 5085- స్టీవ్ స్మిత్ vs ఇంగ్లాండ్
# 5028- డాన్ బ్రాడ్‌మాన్ vs ఇంగ్లాండ్

Exit mobile version