Site icon NTV Telugu

IPL 2023 : సరికొత్త అవతారంలో స్టీవ్ స్మిత్

Steve Smith

Steve Smith

ఐపీఎల్ లీగ్ కి తాను తిరిగి వస్తున్న అంటూ ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. తాను భాగస్వామ్యమయ్యే టీమ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. స్టార్ స్పోర్ట్స్ టీమ్ తో కలిసి కామెంటేటర్ గా అవతరం ఎత్తనున్నట్లు స్టీవ్ స్మిత్ వెల్లడించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 అధికారిక ప్రసారకర్త స్టార్ స్పార్ట్స్ ఎక్స్ పర్ట్ ప్యానెల్ లో భాగం కానున్నట్లు స్మిత్ తెలిపాడు. తనకు తెలిసినంత వరకు నేను ఆటను చాలా బాగా అర్థం చేసుకోగలను.. అంతే బాగా విశ్లేషించగలను కూడా అంటూ స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. స్టార్ స్పార్ట్స్ టీమ్ తో కలిసి పని చేసేందుకు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా.. నాకిది సరికొత్త అనుభవం అని స్మిత్ అన్నాడు.

Also Read : Viveka Case Supreme Court Orders Live: వివేకా కేసు విచారణలో సుప్రీం సంచలన నిర్ణయం

అయితే గతంలో స్టీవ్ స్మిత్ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సహా ప్రస్తుతం ఉనికిలో లేని పుణె వారియర్స్ ఇండియా, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్, కొచ్చి టస్కర్స్ కేరళ జట్ల తరపున స్మిత్ ఐపీఎల్ ఆడాడు. ఈ క్రమంలోనే గతేడాది వేలంలోకి రాగా ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసీస్ మాజీ సారథిని కొనుగోలు చేయలేదు. దీంతో కామెంటేటర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ స్టార్ బ్యాటర్ సిద్దమయ్యాడు.

Also Read : Ajit Doval: చైనాను ఉద్దేశించి అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు..

ఇక ఇటీవలే టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా మెరుగైన ప్రదర్శనకు స్మిత్ కెప్టెన్సీ వ్యూహాలే కారణం. అలాగే ఆసీస్ వన్డే సిరీస్ ను గెలవడంలోనూ సారథిగా అతడి అనుభవం తోడైంది. కాగా స్మిత్ ప్రస్తుతం ఆసీస్ వైస్ కెప్టెన్ గా ఉండగా.. భారత్ ప్రర్యటనలో ఆఖరి రెండు టెస్టులు, వన్డే స్టిరీస్ కు ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. అతడు జట్టును ముందుండి నడిపించాడు. ఇదిలా ఉంటే.. మార్చ్ 31న గుజరాత్ టైటాన్స్-చైన్నె సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ తో ఐపీఎల్ పదహారవ సీజన్ ప్రారంభంకానుంది.

Exit mobile version