NTV Telugu Site icon

CM Revanth Reddy : అక్కడ రూ.630 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మొత్తం రూ. 630.27 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేపట్టినవి. ముఖ్య అభివృద్ధి పనుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

విద్యా రంగ అభివృద్ధి

రూ. 200 కోట్లు: జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్

రూ. 5.5 కోట్లు: ఘన్‌పూర్ లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు

ఆరోగ్య రంగ అభివృద్ధి

రూ. 45.5 కోట్లు: ఘన్‌పూర్ లో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు

అధికారిక భవనాల నిర్మాణం

రూ. 26 కోట్లు: ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం

జల వనరుల అభివృద్ధి

రూ. 148.76 కోట్లు: దేవాదుల రెండో దశ అభివృద్ధి

రూ. 25.6 కోట్లు: 512 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

274 ఇండ్లు ఘన్‌పూర్ నియోజకవర్గ మండలాలకు

238 ఇండ్లు ధర్మసాగర్ & వేలైర్ మండలాలకు

రోడ్ల నిర్మాణం & విస్తరణ

రూ. 15 కోట్లు: మల్లన్నగండి-తాటికొండ-జిట్టగూడెం-తరిగొప్పుల రహదారి విస్తరణ

రూ. 23.5 కోట్లు: గ్రామీణ రహదారుల BT పునరుద్ధరణ (36.30KM)

రూ. 11.9 కోట్లు: గోవర్దనగిరి-చర్లతండా రోడ్డు నిర్మాణం

రూ. 3.7 కోట్లు: నక్కపొక్కల తండా-దుర్గాతండా బీటీ రోడ్డు

రూ. 3.49 కోట్లు: సేవ్య తండా-ఫతేపూర్-కచేర్ తండా బీటీ రోడ్డు

రూ. 2.8 కోట్లు: ఫతేషాపూర్ గ్రామం లక్ష్మి తండా-రామచంద్ర గూడెం బీటీ రోడ్డు

విద్యుత్ రంగ అభివృద్ధి

రూ. 1 కోటి: స్టేషన్ ఘన్‌పూర్ లో NPDCL డివిజనల్ ఆఫీస్ భవనం

రూ. 2.26 కోట్లు: కుర్చపల్లి గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్

రూ. 2.29 కోట్లు: సాగారం గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్

రూ. 2.5 కోట్లు: కొండాపూర్ గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్

రూ. 2.48 కోట్లు: ఫతేషాపూర్ గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్

రూ. 1.48 కోట్లు: రాయగూడెం సబ్ స్టేషన్ ప్రారంభం

ఇతర అభివృద్ధి కార్యక్రమాలు

రూ. 2 కోట్లు: బంజారా భవన్ నిర్మాణం

రూ. 102.1 కోట్లు: మహిళా శక్తి కింద 7 RTC బస్సులు, స్వయం సహాయ సంఘాలకు బ్యాంక్ లింకేజ్

రూ. 0.65 కోట్లు: తెలంగాణ నూనె గింజల సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ సేకరణ కేంద్రం

స్టేషన్ ఘన్‌పూర్ గ్రామపంచాయితీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడం

ఈ అభివృద్ధి పనుల ద్వారా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Amitabh Bachchan : కౌన్ బనేగా కరోడ్ పతి నుంచి తప్పుకోవడం పై స్పందించిన బిగ్ బీ