CM Revanth Reddy : అక్కడ రూ.630 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- స్టేషన్ ఘన్‌పూర్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి
- విద్య, ఆరోగ్య రంగాల్లో ముఖ్యమైన ప్రాజెక్టులు
- గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు, ఇండ్ల నిర్మాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మొత్తం రూ. 630.27 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేపట్టినవి. ముఖ్య అభివృద్ధి పనుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
విద్యా రంగ అభివృద్ధి
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
రూ. 200 కోట్లు: జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
రూ. 5.5 కోట్లు: ఘన్‌పూర్ లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు
ఆరోగ్య రంగ అభివృద్ధి
రూ. 45.5 కోట్లు: ఘన్‌పూర్ లో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు
అధికారిక భవనాల నిర్మాణం
రూ. 26 కోట్లు: ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం
జల వనరుల అభివృద్ధి
రూ. 148.76 కోట్లు: దేవాదుల రెండో దశ అభివృద్ధి
రూ. 25.6 కోట్లు: 512 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
274 ఇండ్లు ఘన్‌పూర్ నియోజకవర్గ మండలాలకు
238 ఇండ్లు ధర్మసాగర్ & వేలైర్ మండలాలకు
రోడ్ల నిర్మాణం & విస్తరణ
రూ. 15 కోట్లు: మల్లన్నగండి-తాటికొండ-జిట్టగూడెం-తరిగొప్పుల రహదారి విస్తరణ
రూ. 23.5 కోట్లు: గ్రామీణ రహదారుల BT పునరుద్ధరణ (36.30KM)
రూ. 11.9 కోట్లు: గోవర్దనగిరి-చర్లతండా రోడ్డు నిర్మాణం
రూ. 3.7 కోట్లు: నక్కపొక్కల తండా-దుర్గాతండా బీటీ రోడ్డు
రూ. 3.49 కోట్లు: సేవ్య తండా-ఫతేపూర్-కచేర్ తండా బీటీ రోడ్డు
రూ. 2.8 కోట్లు: ఫతేషాపూర్ గ్రామం లక్ష్మి తండా-రామచంద్ర గూడెం బీటీ రోడ్డు
విద్యుత్ రంగ అభివృద్ధి
రూ. 1 కోటి: స్టేషన్ ఘన్‌పూర్ లో NPDCL డివిజనల్ ఆఫీస్ భవనం
రూ. 2.26 కోట్లు: కుర్చపల్లి గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్
రూ. 2.29 కోట్లు: సాగారం గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్
రూ. 2.5 కోట్లు: కొండాపూర్ గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్
రూ. 2.48 కోట్లు: ఫతేషాపూర్ గ్రామంలో 33/11 KV సబ్ స్టేషన్
రూ. 1.48 కోట్లు: రాయగూడెం సబ్ స్టేషన్ ప్రారంభం
ఇతర అభివృద్ధి కార్యక్రమాలు
రూ. 2 కోట్లు: బంజారా భవన్ నిర్మాణం
రూ. 102.1 కోట్లు: మహిళా శక్తి కింద 7 RTC బస్సులు, స్వయం సహాయ సంఘాలకు బ్యాంక్ లింకేజ్
రూ. 0.65 కోట్లు: తెలంగాణ నూనె గింజల సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ సేకరణ కేంద్రం
స్టేషన్ ఘన్‌పూర్ గ్రామపంచాయితీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయడం
ఈ అభివృద్ధి పనుల ద్వారా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Amitabh Bachchan : కౌన్ బనేగా కరోడ్ పతి నుంచి తప్పుకోవడం పై స్పందించిన బిగ్ బీ
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!