Site icon NTV Telugu

CM Revanth Reddy : అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా మొత్తం చిట్టా విప్పుతా

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఈ ప్రాంతం గొప్ప చైతన్యంతో కూడినదని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లావాసులు, విద్యార్థులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వరంగల్ అభివృద్ధికి రూ. 6,500 కోట్ల నిధులను కేటాయించినట్లు ప్రకటించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి మెగా ప్రాజెక్టుల ద్వారా వరంగల్‌ను హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

గత పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపిన సీఎం, రాష్ట్రంపై భారీగా పెరిగిన అప్పులను ప్రస్తావించారు. రూ. 8.29 లక్షల కోట్ల బకాయిలను బీజేపీ-బీఆర్‌ఎస్ పాలన నుంచి వారసత్వంగా అందుకున్నామని, ఈ మొత్తంలో కేవలం రూ. 1.53 లక్షల కోట్లు మాత్రమే చెల్లించారని వివరించారు. సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా 1.50 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారని, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామని చెప్పారు. రైతులకు రుణమాఫీ కింద రూ. 20,610 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

నిరుద్యోగులకు 57,946 ప్రభుత్వ ఉద్యోగాలను అందించామని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, స్టేషన్ ఘనపూర్ అభివృద్ధే ఆయన లక్ష్యమని అన్నారు. గత పాలకులు చేసిన అవినీతి, దుర్వినియోగాలపై అసెంబ్లీలో స్పష్టమైన వివరాలు వెల్లడించామని, ఇంకా నిజాలన్నీ బయటపెట్టాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. “ఇప్పటి వరకు చెప్పింది కేవలం ఇంటర్వెల్ మాత్రమే… అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోగా మొత్తం చిట్టా విప్పుతా” అంటూ రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

MLC Ramagopal Reddy: ఎమ్మెల్యే పదవికి వైఎస్ జగన్ రాజీనామా చేయాలి!

Exit mobile version