Site icon NTV Telugu

BRS Protests: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

Brs Ministers

Brs Ministers

BRS Protests: కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు చేయనున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ బీఆర్‌ఎస్‌ డిమాండ్ చేస్తోంది. చార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్‌ఎస్ చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనలు చేపడుతోంది. అన్ని నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ఇవాళ ధర్నా కార్యక్రమాలు జరగనున్నాయి. హైదరాబాద్‌లో జీహెచ్​ఎమ్‌సీ, హెచ్​ఎండీఏ కార్యాలయాల వద్ద బీఆర్ఎస్​ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

Read Also: Accident: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగాప్రమాదం.. ఐదుగురు మృతి

ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నిరసనల్లో పాల్గొంటున్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి , సీతక్క మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజల నుంచి 20 వేల కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమీర్‌పేట మైత్రివనం హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ధర్నాలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తలసాని సాయికుమార్ యాదవ్ పాల్గొన్నారు.

Exit mobile version