Telangana: తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- ప్రీప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి కమిషన్ ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రేవంత్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రీప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిషన్‌లో ఒక ఛైర్మన్, ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. కమిషన్ ఛైర్మన్, సభ్యులను ప్రభుత్వం త్వరలోనే నియమించనుంది. ఛైర్మన్, సభ్యులు రెండేళ్లపాటు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులతోపాటు.. అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన విద్య బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో వెల్లడిచారు. దీనిలో భాగంగానే విద్యాకమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు.
Read Also: Municipality: ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలు సమీప మున్సిపాలిటీలలో విలీనం.. గెజిట్ నోటిఫికేషన్ జారీ
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
తెలంగాణ విద్యా కమిషన్ లక్ష్యాలు:
*మారుతున్న/డైనమిక్ ఎడ్యుకేషనల్ ల్యాండ్‌స్కేప్‌ను పరిగణనలోకి తీసుకుని విద్యారంగంలో విధాన రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వానికి సలహా ఇవ్వడం, థింక్ ట్యాంక్‌గా పనిచేయడం. పైలట్ అధ్యయనాలు చేయడం, పాలసీ నోట్లను అభివృద్ధి చేయడం, సంప్రదింపులు చేయడం, మార్గదర్శకాలు, నియమాలు, సులభతరం చేయడం లాంటి అంశాలపై అధ్యయనం చేసి కమిషన్ సిఫార్సు చేయనుంది.
*నాణ్యమైన ఉన్నత విద్య, ఉన్నత విద్యా సంస్థలతో అప్రెంటిస్‌షిప్/ ఉపాధి నైపుణ్యాలను ఏకీకృతం చేయడం, పాఠశాలల్లో నాణ్యమైన విద్య విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై దృష్టి , ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు పునాది నైపుణ్యాలు వంటి అంశాలపై పరిశీలన చేయనుంది.
*విద్యార్థులను మంచి, బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరులుగా తయారు చేసేందుకు కావాల్సిన విద్యపై సిఫార్సులు చేయడం వంటి అంశాలపై దృష్టి సారించనుంది.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?