Heroines as Action Stars : మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న స్టార్ హీరోయిన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిజం అంటే కేవలం హీరోలకేనా కాదు అని నిరూపిస్తున్నారు నేటి తరం కథానాయికలు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు హీరోయిన్ సెంట్రిక్ యాక్షన్ సినిమాల హవా నడుస్తోంది. సమంత, రష్మిక, నయనతార వంటి స్టార్స్ ఇప్పుడు కత్తులు పట్టి, కండలు తిరిగిన విలన్లను చిత్తు చేస్తూ థియేటర్లలో ఈలలు వేయిస్తున్నారు. యాక్షన్ సినిమాలను నమ్ముకుని తన కెరీర్‌ను కొత్త పుంతలు తొక్కిస్తోంది సమంత. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో రాజీ పాత్రతో తనలోని యాక్షన్ కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆమె, ‘యశోద’, ‘సిటాడెల్’ సిరీస్‌లలో హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘మా ఇంటి బంగారం‘ చిత్రంలో కూడా సమంత ఒక పవర్ఫుల్ యాక్షన్ రోల్లో కనిపించబోతోంది. కేవలం యాక్షన్‌ను మాత్రమే నమ్ముకుని ఆమె చేస్తున్న ఈ ప్రయోగాలు సామ్ ఇమేజ్ను శిఖరానికి చేరుస్తున్నాయి.
Also Read : 2027 Box Office War : బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో.. నలుగురు స్టార్స్ దిగుతున్నారు
Also Read
- Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సైతం ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ యాక్షన్ మూవీ ‘మైసా‘ తో సత్తా చాటడానికి సిద్ధమైంది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం రష్మిక బ్యాంకాక్ వెళ్లి మరీ ప్రత్యేక శిక్షణ పొందుతోంది. రోజుకు ఏకంగా 8 గంటల పాటు కఠినమైన యాక్షన్ ట్రైనింగ్‌లో పాల్గొంటూ శారీరకంగా తనను తాను మలుచుకుంటోంది. ఈ సినిమా రష్మిక కెరీర్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార తన తదుపరి చిత్రం ‘రక్కయి‘లో ఊచకోత కోయడానికి సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తుంటే ఇది అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ అని అర్థమవుతోంది. మరోవైపు సంయుక్త మీనన్ కూడా రూట్ మార్చింది. ‘అఖండ 2’లో ఆమె ఫైటింగ్‌తో అలరించబోతుండగా, ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న ‘ది బ్లాక్ గోల్డ్’ చిత్రం కూడా కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. మొత్తానికి తెలుగు హీరోయిన్లు ఇప్పుడు ‘బ్యూటీ’తో పాటు ‘పవర్’ను కూడా చూపిస్తూ బాక్సాఫీస్ వద్ద తమదైన ముద్ర వేస్తున్నారు.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!