NTV Telugu Site icon

Heeramandi: ఏంటి భయ్యా.. ఇంతమంది స్టార్ హీరోయిన్స్ ఒకే సినిమాలో వేశ్యలుగా నటించారా..?!

13

13

సంజయ్ లీలా భన్సాలీ.. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరైన ఈయన గంగూభాయ్ కతియావాడీ లాంటి సినిమాతో ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు. ఇక మరోసారి ఈయన అలాంటి కథతోనే ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ‘హీరామండి: ది డైమండ్ బజార్..’ సిరీస్ సంబంధించి వార్తలు ఎప్పుడైతే నెట్ ఫ్లిక్స్ లో అనౌన్స్ జరిగిందో ఇక అప్పటినుంచి ఈ సిరీస్ పై పెద్దఎత్తున అంచనాలను పెట్టుకున్నారు సినీ ప్రేమికులు. ఇక ఈ సిరీస్ లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ లాంటి టాప్ హీరోయిన్లను రంగంలోకి తీసుకొచ్చాడు సంజయ్ లీలా భన్సాలీ.

Also read: Venu Swami : ట్రోల్స్‌కి నెగటివ్ రివ్యూస్‌కి విజయ్ దేవరకొండ నాశనం అయ్యాడు!

నిజానికి ఒకే సినిమాలో ఒకటి లేదా రెండు హీరోయిన్ల అందాలను చూడడానికి కళ్ళు సరిపోవు అంటే.. అలాంటిది ఏకంగా ఆరు మంది అందగత్తెలతో ఒక సీరియస్ ప్లాన్ చేశాడు అంటే డైరెక్టర్ కు కథపై ఉన్న నమ్మకమే. అది కూడా ఈ టాప్ హీరోయిన్స్ అందరిని ఓ వేశ్య గృహంలో ఉండే వేశ్యలుగా చూపించబోతున్నారు. ఈ సీరియస్ మొదలైనప్పటి నుంచి ప్రతి పోస్టర్, అలాగే టీజర్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేడు ఉగాది పండుగ సందర్భంగా ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Also read:NMD Farook: నంద్యాల టీడీపీ అభ్యర్థికి తప్పిన పెను ప్రమాదం.. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో..?!

ఇక ట్రైలర్ గురించి చూస్తే.. ఈ సీరియస్ మొత్తం స్వాతంత్రం రాకముందు జరిగినట్లు అర్థమవుతుంది. బ్రిటిష్ వారు పాలించే సమయంలో లాహూర్ లోని హీరామండీ అనే వేశ్య గృహంలో ఉన్న వేశ్యలు వారి స్వేచ్ఛ కోసం, అలాగే స్వాతంత్రం కోసం ఎలా పోరాడారు.. వారు ఎలాంటి కష్టాలు అనుభవించారన్నదే ఈ సిరీస్ కథాంశం. ఇక ఈ సిరీస్ లో భాగంగా వేశ్య గృహ పెద్దగా మనీషా కొయిరాలా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సిరిస్ సంబంధించిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ లో మే 1 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. చూడాలి మరి ఇంతమంది మహారాణులతో కలిసి ఎలాంటి హిట్ కొడతాడో సంజయ్ లీలా భన్సాలీ.

Show comments