NTV Telugu Site icon

Remake Movies: ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యని స్టార్ హీరోలు వీళ్లే…

Vijaymahesh

Vijaymahesh

ఈమధ్య సీక్వెల్ సినిమాలతో పాటుగా రీమేక్ సినిమాలు కూడా ఎక్కువయ్యాయి.. ఒక ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడం వెంటనే సినిమాను రీమేక్ చేస్తున్నారు.. ఇప్పటివరకు చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు సైతం రీమేక్ సినిమాలను చేసి హిట్ కొట్టారు.. అందులో కొందరు హీరోలు ఇంతవరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు వారేవ్వరో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, కమల్ హాసన్, విజయ్ దళపతి, రజినీకాంత్ మొదలుకొని చాలా మంది హీరోలు రీమేక్ సినిమాల్లో నటించి భారీ హిట్ ను అందుకున్నారు.. కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు.. ఆయన ఇప్పటివరకు 28 సినిమాలు చేశారు.. అందులో అన్ని కూడా కొత్తగా చేసినవే.. మహేష్ సినిమాలు రీమేక్ అయ్యాయన్న సంగతి తెలిసిందే.. గతంలో దళపతి విజయ్ కత్తి మూవీని తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ మహేష్‌బాబుకు వచ్చింది.. కానీ నో చెప్పాడు..

అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా రీమేక్ సినిమాలకు దూరంగా ఉన్నారు.. పెళ్లిచూపులుతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ అన్ని కొత్త కథలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ ఇప్పటివరకు ఒక్క రీమేక్ జోలికి వెళ్ళలేదు.. హీరో దుల్కర్ సల్మాన్ ఈయన 45 సినిమాలు చేశాడు.. అందులో ఒక్కటి కూడా రీమేక్ చెయ్యలేదు.. కొత్త కథలతో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.. రక్షిత్ శెట్టి కూడా ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు.. 14 ఏళ్ల కెరీర్‌లో అన్ని స్ట్రెయిట్ సినిమాలే చేశాడు.. వీరంతా ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు..

Show comments