పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ అన్నీ జోరుగా జరుగుతున్నాయి. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను త్వరలోనే గ్రాండ్‌గా నిర్వహించబోతుంది యూనిట్.. ఈ ఈవెంట్ కు స్టార్ హీరోలు గెస్టులా రాబోతున్నారని ఓ వార్త గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుంది..
అయితే మూడు ఈవెంట్ లను నిర్వహించాలని చిత్రయూనిట్ ఆలోచింస్తుందట.. ఈనెల 23 న ఆంధ్రప్రదేశ్ అమరావతిలో నిర్వహిస్తుందని సమాచారం. ఆ తర్వాత చెన్నై లో మ్యూజికల్ ఈవెంట్.. ఆ తర్వాత ఢిల్లీ మరో గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఒక సినిమాకు మూడు సార్లు ఈవెంట్స్ నిర్వహించడం మామూలు విషయం కాదు..
ఇక ఈ ఈవెంట్ కు ఊహించని విధంగా గెస్టులను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఆహ్వానించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఎవరూ ఊహించని స్థాయిలో గ్రాండ్‌గా ఈ ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్మాత అశ్వినీదత్ అనుకుంటున్నారట.. అలాగే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీ కాంత్, కమల్ హాసన్, అమితాబ్ లు కూడా హాజరు కానున్నారని టాక్.. అయితే ఈ లిస్ట్‌పై ఇంకా అధికారిక ప్రకటన ఏం రాలేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్టులు వీళ్లే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి..