NTV Telugu Site icon

Vishal : హీరో విశాల్ హెల్త్ కండీషన్ పై స్పందించిన స్టార్ హీరో..ఏమన్నారంటే ?

Vishal Madaha

Vishal Madaha

Vishal : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డెంగీతో పాటు వైరల్ ఫీవర్ కారణంగా తీవ్రమైనటు వంటి ఒళ్లు నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ‘మదగజరాజ’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో విశాల్‌ను చూసిన వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మా హీరో విశాల్‌ ఏంటి ఇలా అయ్యాడంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశాల్ కనీసం చేతిలో మైక్‌ పట్టుకోలేకపోతున్నారు. చేతులు వణుకుతున్నాయి. ఎక్కువ సమయం నిలబడటానికి కూడా తనుకు సాధ్యం కాలేదు. దాంతో విశాల్‌ హెల్త్ గురించి ఎవరికి తోచిన విధంగా వారు పుకార్లు పుట్టిస్తున్నారు.

Read Also:Justin Trudeau: ‘‘మేం అమెరికన్లం కాము’’.. ట్రంప్ ‘‘కెనడా 51వ రాష్ట్రం’’ కామెంట్స్‌పై ట్రూడో..

దీంతో ఈ పుకార్లు వాస్తవం కాదని డాక్టర్లు స్వయంగా హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్ చేశారు. హెల్త్‌ బులిటెన్‌లో వైరల్‌ ఫీవర్‌తో విశాల్‌ బాధ పడుతున్నట్లుగా తెలిపారు. ఇటీవల విశాల్‌ హెల్త్‌ గురించి ప్రముఖ నటి కుష్బూ మాట్లాడారు.. విశాల్‌ తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్నారు. అయితే తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆయన వచ్చారు. కానీ జ్వరం కారణంగా ఈవెంట్‌ జరిగిన వెంటనే విశాల్‌ని నేరుగా ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లుగా ఆమె తెలిపారు. తాజాగా విశాల్ ఆరోగ్య పరిస్థితిపై తమిళ్ స్టార్‌ హీరో జయం రవి స్పందించాడు.

Read Also:Pawan Kalyan: నా జన్మంతా పిఠాపురం ప్రజలకి రుణపడి ఉంటా..

ఒక సినిమా ప్రమోషన్‌లో భాగంగా జయం రవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాల్ హెల్త్ కండీషన్ పై స్పందించాడు. విశాల్ చాలా మంచి వ్యక్తి. ఇండస్ట్రీలోనే కాకుండా బయట కూడా చాలా మందికి సేవ చేశారు. ఎంతో మందికి సహాయం అందించారు. ప్రస్తుతం ఆయనకు బ్యాడ్‌ టైమ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో బ్యాడ్‌ టైమ్ అనేది వస్తుంది. అయితే ఆ బ్యాడ్‌ టైమ్‌ నుంచి త్వరలోనే విశాల్‌ బయటపడతాడన్న నమ్మకం ఉంది. తిరిగి సాధారణ స్థితికి వచ్చి విశాల్‌ అభిమానులను తన సినిమాలతో అలరిస్తాడని జయం రవి ఆశాభావం వ్యక్తం చేశారు.

Show comments