Mammootty : మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) శుక్రవారం కన్నుమూశారు. ఆమె వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున పరిస్థితి విషమించి ఆమె చనిపోయారు. ఆమెకు మొత్తం మమ్ముట్టితో కలిపి ఆరుగురు సంతానం. కొచ్చికి సమీపంలోని చెంబు గ్రామంలో ఆమె చాలా మందికి తెలుసు. చెంబు ముస్లిం జమాత్ మస్జిదులో సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.
Read Also : Raviteja: కొత్త కారుకు ఫ్యాన్సీ నంబర్ కోసం రవితేజ ఎంత ఖర్చుచేశారో తెలుసా ?
మమ్ముట్టి తల్లి మరణ వార్త తెలుసుకుని చాలామంది సెలబ్రిటీలు మమ్ముట్టిని పరామర్శిస్తున్నారు. మమ్ముట్టితో పాటు ఆయన తనయుడు దుల్మర్ సల్మాన్ మలయాళ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతోన్నారు. పలువురు సినీ ప్రముఖులు మమ్ముట్టి ఫ్యామిలీకి సంతాపం తెలిపేందుకు వారి ఇంటికి చేరుకుంటున్నారు. తల్లి మరణంతో త్వరలో రిలీజ్ కానున్న ఏజెంట్ మూవీ ప్రమోషన్స్‌కు మమ్ముట్టి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు మలయాళంలో ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్రలో నచించారు.
Read Also :Hollywood: రీఎంట్రీకి రెడీ అయిన వరల్డ్ బిగ్గెస్ట్ యాక్షన్ హీరో
