Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Stage Performer From Chhattisgarh Gang Raped In Jharkhands Palamu

Atrocious: కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం.. జార్ఖండ్లో ఘటన

Published Date :March 4, 2024 , 6:52 pm
By Rajesh Veeramalla
Atrocious: కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం.. జార్ఖండ్లో ఘటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

జార్ఖండ్‌లోని దుమ్కాలో స్పానిష్ మహిళా టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం ఉదంతం మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 21 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఛత్తీస్‌గఢ్‌కు చెందినదిగా గుర్తించారు. పాలములోని విశ్రంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. అయితే.. ఆమే స్టేజ్ ప్రదర్శన ఇవ్వడం కోసమని జార్ఖండ్‌కు వెళ్లింది. కాగా.. బాధితురాలి సహోద్యోగులే అత్యాచారానికి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించింది. ఈ ఘటన సోమవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో.. ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. శనివారం బాధితురాలు జార్ఖండ్‌లోని విశ్రాంపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో స్టేజ్ షోలో పాల్గొనడానికి తన సహచరులతో కలిసి చత్తీస్‌గఢ్ నుండి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఆర్కెస్ట్రాలో పనిచేసేదని గుర్తించారు. కొన్ని కారణాల వల్ల అక్కడ కార్యక్రమం నిర్వహించలేక పోవడంతో.. ఆ అమ్మాయి తన స్నేహితులతో కలిసి అదే కారులో మరో కార్యక్రమానికి బయలుదేరింది. దారిలో వెళ్తుండగా.. బాధితురాలికి మత్తు మందు ఇవ్వడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయిందని తెలిపారు.

ఆ తర్వాత.. బాధితురాలిపై తోటి కళాకారులు ముగ్గురు కదులుతున్న కారులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని అపస్మారక స్థితిలో రోడ్డు పక్కన వదిలి వెళ్లిపోయారు. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. స్పృహలోకి వచ్చిన తరువాత.. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరొకరి పోలీసులు గాలిస్తున్నారు. .

మరోవైపు.. ఈ ఘటన దురదృష్టకరమని బీజేపీ ఎంపీ గీతా కోరా తెలిపారు. అంతేకాకుండా.. అటు సీఎం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో పెరుగుతున్న అత్యాచార ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chhattisgarh
  • gang rape
  • Jharkhand
  • Stage performer
  • telugu news

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions