NTV Telugu Site icon

Staff Nurse Recruitment: అతిత్వరలో 4,661 నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Staff Nurse

Staff Nurse

Staff Nurse Recruitment: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ రానుంది. రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక సంస్థ త్వరలో 4,661 స్టాఫ్ నర్సుల నియామక ప్రకటన విడుదల చేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 31లోపు ఈ నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్ధులు సన్నద్ధమవడానికి వీలుగా కనీసం రెండు నెలల గడువు ఇచ్చే అవకాశం ఉంది. పరీక్షలో వచ్చిన మార్కులు, వెయిటేజీ మార్కులను జోడించి, తుది అర్హులను ఎంపిక చేయనున్నారు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామక ప్రక్రియను విజయవంతంగా ముగించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ తదుపరి కార్యాచరణపై దృష్టిపెట్టింది.

టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి ఏవైతే.. నిబంధనలను పాటిస్తుందో.. అదే విధానాన్ని స్టాఫ్ నర్సుల నియామకాల్లోనూ అనుసరించాలని వైద్యశాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థను ఆదేశించింది. ఈ మేరకు నర్సుల పోస్టుల భర్తీకి అర్హత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులకు రెండు నెలలు సమయం కూడా ఇస్తారు. బహుళ ఐచ్ఛిక సమాధానాల రూపంలో ప్రశ్నపత్రం రూపకల్పనకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమిస్తారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకన బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

T Congress: టీ-కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం.. నేడు హైదరాబాద్‌కు దిగ్విజయ్

ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద, పొరుగు సేవల ప్రాతిపదికన పని చేస్తున్న స్టాఫ్ నర్సులకు ఓ శుభవార్త ఉంది. ఇప్పుడు పని చేస్తున్నా.. గతంలో పని చేసినా.. అదనపు మార్కులు ఉండనున్నాయి. అర్హత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా గరిష్ఠంగా 80 పాయింట్లు వస్తాయి. ఇక మిగిలిన 20 పాయింట్లను ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందిగా పనిచేసిన వారికి వెయిటేజీగా ఇస్తారు. ఈ కేటగిరీ అభ్యర్థులు అనుభవ ధ్రువపత్రం కోసం సంబంధిత ఉన్నతాధికారికా దరఖాస్తు చేయాలి. ఆ ధ్రువపత్రాన్ని అభ్యర్థులు ఇతర సర్టిఫికెట్లతో పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇస్తారు. ఇక్కడ 6 నెలలు పూర్తయితేనే వెయిటేజీకి అర్హులుగా పరిగణిస్తారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, హాజరు రిజిస్టర్ల కాపీలను జతపరచాలి. వీరు ఆసుపత్రుల బాధ్యుల నుంచి అనుభవ ధ్రువీకరణను పొందాల్సి ఉంటుంది. పోస్టులకు దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులందరూ తప్పక తెలంగాణ రాష్ట్ర నర్సింగ్‌ మండలిలో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలి.