NTV Telugu Site icon

Andhra Pradesh: ‘మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా ’

Ssc Student

Ssc Student

Andhra Pradesh: ఇటీవల కాలంలో విద్యార్థులు పరీక్షల్లో రాసే చిలిపి సమాధానాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. సాధారణంగానే విద్యార్థులు పరీక్షలంటేనే కాస్త భయాందోళనలకు గురవుతారు. కొందరు ఎగ్జామ్స్‌కు ముందు ప్రణాళికతో ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అవుతారు. మరికొందరు ఏదో వెళ్లి పరీక్ష రాసివచ్చాం అన్నట్లుగా ఉంటారు. సాధారణంగా పరీక్షల్లో ప్రశ్నాపత్రంలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాస్తుంటారు. చాలా మంది ఏదో తెలియకపోయినా సినిమా స్టోరీయో.. పాటలు.. కథలు.. లేకపోతే ఉపాధ్యాయుడిని కాకపట్టేందుకు ఏవో ఇబ్బందులను చెబుతూ జవాబులు రాసింది చూసే ఉంటాం అయితే, తాజాగా పరీక్షకు హాజరైన విద్యార్థి ఓ ప్రశ్నకు రాసిన సమాధానం చూసి ఖంగుతిన్నాడు.

Read Also: Andhra Pradesh: ఏజెన్సీలో హృదయవిదారక ఘటన.. కొడుకు మృతదేహంతో 8 కిలోమీటర్ల నడక..

బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాలు దిద్దుతున్న ఓ టీచర్ విద్యార్థి రాసిన జవాబును చూసి కంగుతిన్నారు. తెలుగు సబ్జెక్టులో రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఓ విద్యార్థి వింత సమాధానం రాశాడు. ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని ఉండటం చూసి..టీచర్ అవాక్కయ్యారు. వెంటనే జవాబు పత్రాన్ని ఉన్నతాధికారులకు చూపించారు. అయితే, ఆ విద్యార్థికి 70 మార్కులు రావడం విశేషం. మరో ఆన్సర్ షీట్‌లో రామాయణంలో పాత్ర స్వభావం గురించిన ప్రశ్నకు.. ‘మంధర.. శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది’ అని రాయడంతో.. ఉపాధ్యాయులు కంగుతిన్నారు.