RRR Wins International Award: ట్రిపుల్ ఆర్ మూవీ వచ్చి నెలలు గడుస్తున్న దాని క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీతో పాటు విదేశాల్లోనూ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా వసూళ్ల రికార్డులు మాత్రమే కాదు… అవార్డులు అందుకుంటోంది. పలువురు హాలీవుడ్ దర్శక రచయితలు, ఫిల్మ్ మేకర్స్ ప్రశంసిస్తూ ట్వీట్లు వేశారు.
Read Also: Priyadarshi: నల్లగా, హీరో కంటే పొడుగ్గావున్నావని రిజక్ట్ చేశారు
శాటన్ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’కు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు లభించింది. బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్… మూడు విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్’కు నామినేషన్ లభించింది. దర్శకుడిగా రాజమౌళికి అవార్డు రానప్పటికీ… ఆయన సినిమాకు అవార్డు వచ్చింది.
‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ వస్తే చూడాలని యావత్ భారత ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇండియా నుంచి ఉత్తమ విదేశీ సినిమా కేటగిరీలో సినిమాను పంపలేదు. అయితే… ‘ఆర్ఆర్ఆర్’ అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ ఒక్క ఇంటర్నేషనల్ ఫిల్మ్ కాకుండా, ఇతర విభాగాల్లో సినిమాను నామినేట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ అవార్డులకు ముందు శాటన్ అవార్డు రావడం ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులకు మంచి ఎనర్జీ ఇచ్చిందని చెప్పవచ్చు.
Read Also: Telugu Movie Sequels : తెలుగులో సీక్వెల్స్ హవా.. మార్కెట్ ఎన్ని కోట్లంటే
ఇదిలా ఉంటే.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ప్రతి ఏడాది గోవాలో జరుగుతుంది. ఈసారి నవంబర్ 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గోవాలో నిర్వహించనున్నారు. ఆ చలన చిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమాలో ప్రదర్శించనున్న ఫీచర్ ఫిల్మ్స్, మెయిన్ స్ట్రీమ్ సినిమా కేటగిరీలో కూడా ‘ఆర్ఆర్ఆర్’ ఎంపిక అయ్యింది. దాంతో పాటు ‘ఆఖండ’ కూడా చోటు సంపాదించుకుంది.