PM Modi: “మా నాన్న మోడీ చెబితేనే వింటారు”.. ఇన్‌ఫ్లుయెన్సర్ రీల్‌పై స్పందించిన ప్రధాని.. ప్రజలకు కీలక విజ్ఞప్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: దేశ ప్రజల ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక సందేశం ఇచ్చారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ యువరాజ్ దువా రూపొందించిన ఒక రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలు చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవాలని కోరారు. వాస్తవానికి.. సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్ అయిన యువరాజ్ దువా సరదాగా ఒక రీల్ చేశాడు. తన తండ్రికి మోడీ అంటే ఎంతో ఇష్టమని, ప్రధాని మోడీ చెబితే ఏం అయినా చేస్తారని చెప్పాడు. మోడీకి ఒక రిక్వెస్ట్ చేశాడు. యవరాజ్ తండ్రికి షుగర్ ఉందట. అయినా స్వీట్లు తినడం ఆపడం లేదట. తన కుటుంబీకులు ఎవ్వరు చెప్పినా వినడం లేదట. ప్రధాని మోడీ మాటలను మాత్రమే నా తండ్రి వింటారని యువరాజ్ అన్నాడు. అందుకే ప్రధాని మోడీకి ఒక అభ్యర్థన చేశాడు. దయ చేసి నెక్ట్స్ మన్ కీ బాత్ కార్యక్రమంలో షుగర్ కంట్రోల్ గురించి మాట్లాడండి. మీరు చెబితే మా నాన్న తప్పకుండా వింటారని యువరాజ్ పేర్కొన్నాడు.
READ MORE: Trump: ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ వ్యూహం ఇదేనా? ఇరాన్ ఏం చేయబోతుంది?
Also Read
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- 8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
ఇక ఈ వీడియోపై ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోడీ స్పందించారు. యువరాజ్ దువాకి సంబంధించి వీడియోను స్టోరీలో షేర్ చేశారు. యువరాజ్ తండ్రితో పాటు దేశప్రజలందరూ చక్కెర వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండాలని కోరారు. అధిక చక్కెర వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలను వివరిస్తూనే, ప్రతిరోజూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని మోడీ సూచించారు. “మీ శ్రేయస్సుపై దృష్టి పెట్టండి. బాగా తినండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. అధిక చక్కెర అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. ఊబకాయం ముప్పు కూడా పెరుగుతుంది. అలాగే, యోగాను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి ఇది ఒక గొప్ప మార్గం.” అని ప్రధాని పేర్కొన్నారు. ఇక ప్రధాని సందేశం ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ప్రధాని తన వీడియోను షేర్ చేయడం పట్ల యువరాజ్ దువా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన వీడియో ప్రధాని మోడీ వరకు చేరుతుందని అనుకోలేదన్నాడు.
తాజావార్తలు
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!