Rajamouli: ఫలితం ఏదైనా.. హార్ట్ బ్రేక్ అవుతుంది.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
- బుమ్రా, ట్రెంట్ బౌల్డ్ వంటి టాప్ బౌలర్లను తట్టుకుని శ్రేయస్ ఆడిన షాట్లు అద్భుతం.
- థర్డ్ మ్యాన్ దిశగా యార్కర్లను బౌండరీలుగా మలచిన విధానం చెప్పలేనిది.
- అయ్యర్ టైటిల్ గెలిచే అర్హత కలిగిన ఆటగాడు.
- ఆర్సీబీ తరఫున వేల పరుగులు చేసిన కోహ్లీ కూడా టైటిల్ గెలవాల్సిన అర్హత ఉన్న ఆటగాడే.
- “ఫలితం ఏదైనా... హార్ట్ బ్రేక్ మాత్రం తప్పదు” అని భావోద్వేగంతో ట్వీట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పేరు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాలతో భారత సినిమాను ముఖ్యంగా తెలుగు సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి, కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. క్రికెట్ అంటే కూడా ఆయనకు మక్కువ ఎక్కువ. ఇకపోతే తాజాగా ఐపీఎల్ 2025లో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ అనంతరం, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీలపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Read Also: Preity Zinta: కన్ను కొట్టిన ప్రీతి జింటా.. ఎవరిని చూసి అలా చేసిందంటే..?
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్‌కు చేరిన తర్వాత శ్రేయస్ బ్యాటింగ్‌పై సినీ దర్శకుడు రాజమౌళి స్పందించారు. బుమ్రా, ట్రెంట్ బౌల్డ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్ల యార్కర్లు ఎదురుగా ఉన్నా, వాటిని థర్డ్ మ్యాన్ దిశగా చక్కగా గైడ్ చేస్తూ బౌండరీలుగా మార్చిన శ్రేయస్ స్టైల్‌ను రాజమౌళి గొప్పగా అభివర్ణించారు. అయ్యర్ బ్యాటింగ్ చూడడం నిజంగా ఆనందాన్ని కలిగించిందని, అతను జట్టును ఫైనల్‌కి తీసుకెళ్లడంలో పెద్ద పాత్ర పోషించాడని ప్రశంసించారు. అతను టైటిల్ గెలుచుకునే అర్హత కలిగిన ఆటగాడు అని పేర్కొన్నారు.
Read Also: Realme C73 5G: కేవలం రూ.10,499లకే 6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌తో రియల్‌మీ C73 5G భారత్‌లో లాంచ్..!
మరోవైపు, రాజమౌళి మరో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై కూడా అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఆర్సీబీ తరఫున వేల పరుగులు సాధించిన కోహ్లీకి కూడా టైటిల్ గెలిచే అర్హత ఉందని పేర్కొన్నారు. ఇక రాజమౌళి చివరగా తన ట్వీట్‌లో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఈ ఫైనల్‌లో ఎవరు గెలిచినా సరే, మరోవైపు హార్ట్ బ్రేక్ మాత్రం తప్పదు అంటూ రాసుకొచ్చారు. జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ట్రోఫీ కోసం పోరు తారస్థాయిలో ఉండనుంది. ఇది రెండు జట్లకు టైటిల్ గెలిచే తొలి అవకాశం కావడంతో ఉత్కంఠత మరింత ఎక్కుగా మారింది.
Iyer guiding Bumrah’s and Boult’s yorkers to the third man boundary… Exquisite…
This man leads Delhi to a final… and is dropped…
Leads Kolkata to a trophy… dropped…
Leads a young Punjab to the finals after 11 years.
He deserves this year’s trophy too…On the other hand,… pic.twitter.com/ws0anhcZ3l
— rajamouli ss (@ssrajamouli) June 2, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!