Site icon NTV Telugu

Rajamouli: ఫలితం ఏదైనా.. హార్ట్ బ్రేక్‌ అవుతుంది.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్..!

Rajamouli Ss

Rajamouli Ss

Rajamouli: దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి పేరు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి చిత్రాలతో భారత సినిమాను ముఖ్యంగా తెలుగు సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి, కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. క్రికెట్‌ అంటే కూడా ఆయనకు మక్కువ ఎక్కువ. ఇకపోతే తాజాగా ఐపీఎల్ 2025లో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ అనంతరం, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌, విరాట్ కోహ్లీలపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Read Also: Preity Zinta: కన్ను కొట్టిన ప్రీతి జింటా.. ఎవరిని చూసి అలా చేసిందంటే..?

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్‌కు చేరిన తర్వాత శ్రేయస్ బ్యాటింగ్‌పై సినీ దర్శకుడు రాజమౌళి స్పందించారు. బుమ్రా, ట్రెంట్ బౌల్డ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్ల యార్కర్లు ఎదురుగా ఉన్నా, వాటిని థర్డ్ మ్యాన్ దిశగా చక్కగా గైడ్ చేస్తూ బౌండరీలుగా మార్చిన శ్రేయస్ స్టైల్‌ను రాజమౌళి గొప్పగా అభివర్ణించారు. అయ్యర్ బ్యాటింగ్ చూడడం నిజంగా ఆనందాన్ని కలిగించిందని, అతను జట్టును ఫైనల్‌కి తీసుకెళ్లడంలో పెద్ద పాత్ర పోషించాడని ప్రశంసించారు. అతను టైటిల్ గెలుచుకునే అర్హత కలిగిన ఆటగాడు అని పేర్కొన్నారు.

Read Also: Realme C73 5G: కేవలం రూ.10,499లకే 6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌తో రియల్‌మీ C73 5G భారత్‌లో లాంచ్..!

మరోవైపు, రాజ‌మౌళి మరో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై కూడా అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఆర్సీబీ తరఫున వేల ప‌రుగులు సాధించిన కోహ్లీకి కూడా టైటిల్ గెలిచే అర్హత ఉందని పేర్కొన్నారు. ఇక రాజమౌళి చివరగా తన ట్వీట్‌లో ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఈ ఫైనల్‌లో ఎవరు గెలిచినా సరే, మరోవైపు హార్ట్ బ్రేక్ మాత్రం త‌ప్ప‌దు అంటూ రాసుకొచ్చారు. జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ట్రోఫీ కోసం పోరు తారస్థాయిలో ఉండనుంది. ఇది రెండు జట్లకు టైటిల్ గెలిచే తొలి అవకాశం కావడంతో ఉత్కంఠత మరింత ఎక్కుగా మారింది.

Exit mobile version