Site icon NTV Telugu

Varanasi : ‘వారణాసి’ కోసం రాజమౌళి కొత్త ప్లాన్.. ఆ సీన్లు మాత్రమే ఐమాక్స్ ఫార్మాట్‌లో!

Varanasi

Varanasi

గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. మహేష్ బాబు ఈ సినిమాలో ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా, విలన్ ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్ ప్రియాంక చోప్రా ‘మందానికి’ అనే పాత్రలో నటిస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, త్వరలోనే అంటార్కిటికా వంటి అరుదైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనుంది. అయితే తాజాగా కోసం దర్శకుడు రాజమౌళి ఒక వినూత్నమైన ఫార్ములాను సిద్ధం చేసినటు ఓ వార్త వైరల్ అవుతుంది.

సాధారణంగా భారీ చిత్రాలను ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయడం చూస్తుంటాం, కానీ ఈ సినిమా విషయంలో రాజమౌళి ఒక భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లో ఐమాక్స్ స్క్రీన్స్ తక్కువగా ఉండటం, మెజారిటీ ప్రేక్షకులు సినిమా స్కోప్ ఫార్మాట్ థియేటర్లలోనే చూస్తుండటంతో.. మూవీ మొత్తం కాకుండా కేవలం కీలక సన్నివేశాలను మాత్రమే ‘ట్రూ ఐమాక్స్’ అనుభూతిని ఇచ్చేలా డిజైన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంటే సినిమా మొత్తం వైడ్ స్క్రీన్‌లో సాగుతూ, కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు వచ్చినప్పుడు మాత్రం స్క్రీన్ సైజ్ పెరిగి ఐమాక్స్ ఫుల్ ఫ్రేమ్ అనుభవాన్ని అందిస్తుంది. హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తన సినిమాలకు వాడే ఈ టెక్నిక్‌ను ఇప్పుడు రాజమౌళి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా వాడుతుండటం విశేషం. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.

Exit mobile version