Site icon NTV Telugu

SS Rajamouli: కీరవాణికి పద్మశ్రీ.. జక్కన్న ఏమన్నారంటే?

Rajamouli

Rajamouli

SS Rajamouli: కీరవాణికి పద్మశ్రీ అవార్డుపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. అభిమానులందరు ఆశిస్తున్నట్లుగానే తాను ఎదురుచూశానని ఆయన అన్నారు. పద్మశ్రీ అవార్డు గుర్తింపు కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నానన్నారు. ప్రపంచం గట్టిగా అనుకుంటే ఏదో ఒకరూపంలో ప్రతిఫలం అందుతుందని దర్శకధీరుడు అభిప్రాయపడ్డారు. ప్రపంచం తనతో మాట్లాడితే ఒక మాట చెప్పాలనుకుంటున్నానన్న రాజమౌళి.. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక మరోటి ఇవ్వు అంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అయిన తెలిసిందే.

Dasara: యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దసరా’ టీజర్‌కు ముహూర్తం ఖరారు

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషన్, పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. కాగా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటడంలో ఆయన కీలకంగా నిలిచాడు. అలాగే ఇటీవలే.. ఆయన కంపోస్ చేసిన నాటు నాటు.. పాట ఆస్కార్ బరిలో నామినేషన్ పొందడమే కాకుండా.. వివిష్ట అవార్డు అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్దున అందుకున్నారు. కీరవాణి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ అవార్డు ఎంపికయ్యారు.

 

Exit mobile version