SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన దృశ్య విస్మయం ‘బాహుబలి’. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా, తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే.. ఆ తర్వాత వచ్చిన ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ సీక్వెల్ విడుదలై దాదాపు తొమ్మిదేళ్లు కావస్తున్నా, అప్పట్లో అది సృష్టించిన రికార్డులను అధిగమించడం ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాలేదు. ఇంతటి అద్భుత దృశ్యకావ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించడం వెనుక జక్కన్న బృందం పడిన కఠోర శ్రమను ‘బాహుబలి ది టార్చ్ బ్యారర్’ డాక్యుమెంటరీలో ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో, సినిమా విడుదల తర్వాత తన జీవితంలో చోటుచేసుకున్న ఓ హృదయవిదారక సంఘటనను గుర్తుచేసుకుంటూ రాజమౌళి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ జ్ఞాపకాన్ని పంచుకుంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.
“మా వదిన (కీరవాణి భార్య శ్రీవల్లి) బయటకు వెళ్లినప్పుడు ఓ వృద్ధురాలు ఆమెను గుర్తుపట్టింది. ‘అమ్మా.. నువ్వు బాహుబలి చిత్ర నిర్మాణంలో భాగస్వామివి కదా?’ అని అడిగింది. అవునని చెప్పగానే.. ఆ పెద్దావిడ కృతజ్ఞతలు తెలుపుతూ తన బాధను పంచుకుంది. ‘నాకు క్యాన్సర్ వ్యాధి ఉంది. మొదటి భాగం చూసినప్పటి నుంచి రెండో భాగం రాకముందే నేను చనిపోతానేమో అని భయపడ్డాను. కానీ దేవుడి దయ వల్ల పార్ట్-2 చూసేవరకు బతికాను. సినిమా చూశాక నా మనసు తృప్తిగా ఉంది’ అని చెప్పింది.” అని రాజమౌళి తెలిపారు. ఈ ఈ విషయాన్ని చెబుతూ రాజమౌళి తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. ఎప్పుడూ ఎంతో గంభీరంగా ఉండే జక్కన్న.. ఓ అభిమాని మాటలకు ఒక్కసారిగా చలించిపోయాడు. ఈ దిగ్గజ డైరెక్టర్ కన్నీళ్లు పెట్టుకోవడం తామెప్పుడూ చూడలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!