Srushti Fertility Case: ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసులో కలకలం.. మరో ఇద్దరి వైద్యుల అరెస్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srushti Fertility Case: వైద్య వర్గాల్లో ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పెంచింది. తాజాగా ఈ కేసులో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)కు చెందిన ఇద్దరు వైద్యులను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ వాసుపల్లి రవి కుమార్, ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవి ఉన్నారు. ఇక వాసుపల్లి రవి కుమార్ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు కావడంతో ఈ కేసులో మరో రాజకీయ కోణాన్ని తీసుక రాబోతుంది.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇదివరకు ఇదే కేసులో అరెస్టయి, బెయిల్ పై విడుదలైన డాక్టర్ విద్యుల్లత కూడా కేజీహెచ్ పిల్లల విభాగంలో పనిచేశారు. ఈ వైద్యులు కేజీహెచ్‌లో విధులు నిర్వహిస్తూనే ‘సృష్టి’ ఫెర్టిలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేవారని ఆరోపణలు ఉన్నాయి. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఈ అరెస్టులపై తనకు వివరాలు తెలియవని తెలిపారు. డాక్టర్ వాసుపల్లి రవి కుమార్ గత మూడు రోజులుగా సెలవులో ఉన్నట్లు సమాచారం.
ఇక మరో వైపు, ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు వైద్యులు డాక్టర్ రమ్య, డాక్టర్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 28కి చేరింది. దర్యాప్తులో బయటపడ్డ వివరాల ప్రకారం, సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత ఇప్పటి వరకు సుమారు 50 మంది బాధితుల వద్ద నుంచి రూ.20 కోట్లకు పైగా వసూలు చేశారు. మరో కీలక నిందితురాలు సంతోషి ఏజెంట్ల ద్వారా 18 మంది శిశువులను సేకరించినట్లు తేలింది.
Boycott G Pay- Phone Pay: ట్రెండింగ్‌లో “బాయ్‌కాట్ గూగుల్ పే, ఫోన్ పే”.. ఎందుకో తెలుసా..?
ముఖ్యంగా గిరిజన మహిళలను ప్రలోభపెట్టి వారి నుంచి శిశువులను రూ.5 లక్షలకు కొనుగోలు చేసి, తమ క్లయింట్లకు ఒక్కో శిశువును రూ.50 లక్షలకు విక్రయించినట్లు వెల్లడైంది. మొత్తం 80 మంది పిల్లలను అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. తల్లులను గుర్తించి శిశువులను తిరిగి వారికి అప్పగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!