శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త. ఈరోజు నుంచి మల్లన్న స్పర్శ దర్శనం తిరిగి ప్రారంభం కానుంది. సామాన్య భక్తులకు వారంలో 4 రోజులు ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని దేవస్థానం కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు భక్తులు స్వామిని తాకే అవకాశం ఉంది. స్పర్శ దర్శనం సమయంలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి అన్న విషయం గుర్తుంచుకోవాలి.
Also Read: AP Liquor Scam: కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది.. జైలు వద్ద మరోసారి చెవిరెడ్డి హంగామా!
రోజుకు వేయి మంది భక్తులకు ఉచిత స్పర్శ దర్శనంకు అవకాశం ఉంటుంది. కంప్యూటరైజ్డ్ టోకెన్ విధానం ద్వారా రోజుకు 1,000 మందికి దర్శనం కల్పిస్తారు. ఆధార్ కార్డ్ గుర్తింపు ద్వారా టొకన్లు జారీ చేస్తారు. టోకెన్‌లో భక్తుల పేరు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, క్యూఆర్ కోడ్ ఉంటాయి. ఉత్సవాలు, పండుగలు, సెలవు రోజుల్లో స్పర్శ దర్శనం ఉండదు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో ఈ దర్శనం ఉండదు. ఉచిత స్పర్శ దర్శనాన్ని మరలా పునఃప్రారంభిస్తున్నామని, దేవస్థానం దగ్గర టోకెన్లు ఇస్తారన్నారని దేవస్థానం ఈవో ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు ఏ రోజుకారోజు ఉచిత స్పర్శదర్శనం టోకన్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
