NTV Telugu Site icon

Srisailam Dam: విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్న శ్రీశైలం డామ్.. వీడియో చూస్తే మతిపోద్ది!

Srisailam Dam

Srisailam Dam

Beautiful View of Srisailam Dam in Night: గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. మంగళవారం వరకు 5 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.. తాజాగా మరో ఐదు గేట్లను ఎత్తారు. దీంతో మొత్తంగా 10 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్‌వైపు ప్రవహిస్తోంది. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతోంది.

కృష్ణమ్మ పరవళ్లు తొక్కడాన్ని చూసేందుకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. అయితే అందరినీ శ్రీశైలం డామ్‌పై ఉన్న విద్యుత్ కాంతులు ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం రాత్రి మువ్వన్నెల జెండా రంగుల విద్యుత్ కాంతుల వెలుగుల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ సుందర దృశ్యం మహా అద్భుతంగా ఉంది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

Also Read: IPL 2025 Mega Auction: ఎనిమిది మందికి అవకాశం ఇవ్వండి.. టాప్ ఐపీఎల్‌ ఫ్రాంచైజీ విజ్ఞప్తి!

ఎగువన కృష్ణా బేసిన నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. శ్రీశైలం జలాశయం నిండడానికి మరో అడుగు దూరం మాత్రమే ఉంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులుగా ఉంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 215.51గా ఉంది. జలాశయం నీటి నిల్వ సామర్ధ్యంలో ఇది 97.55 శాతంగా ఉంది.