Site icon NTV Telugu

Minister Srinivas Goud: ఎన్నికల కోసమే మోడీ బీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు

Minister Srinivas Goud

Minister Srinivas Goud

వరంగల్ లోని బీజేపీ నిర్వహించిన సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఈ సభలో మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సలు తెలంగాణ ఉద్యమంలో మోడీ పాత్ర ఎంటి..?, మోడీయే విశ్వాస ఘతకుడు.. ద్రోహి అద్వానీ, వెంకయ్య నాయుడులను అతను తొక్కి వేశారు అంటూ ఆరోపించారు.

Read Also: Sharad Pawar: నాలో ఫైర్‌ ఇంకా అలాగే ఉంది.. అజిత్‌కు శరద్‌ పవార్‌ వార్నింగ్

విభజన హామీలు అమలు చేయని మీరా నమ్మక ద్రోహులు ? మేమా ? అంటూ ప్రధానిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. కుటుంబ పాలన అంటారా?.. మరీ ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇచ్చారు.. ఏమైనా RSS కార్యకర్తకు ఇచ్చారా?.. అంటూ ఆయన ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళు దేవుళ్ళను వదలలేదు.. మాఠలను వదలలేదు.. మీరే అవినీతి పరులని మంత్రి అన్నారు.

Read Also: Bro First Single: మై డియర్ మార్కండేయ… రికార్డ్స్ ని రఫ్ఫాడిద్దాం పద

మోడీ ప్రధాన మంత్రిగా వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశాడు. ఎన్నికల కోసమే మోడీ బీఆర్ఎస్ సర్కార్ పై విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు మోడీ మాటలను నమ్మరు.. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు.. మేము చెప్పని హామీలను కూడా ప్రకటించి.. అమలు చేశాం.. మిగిలిన హామీలను అమలు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Read Also: Harish Rao: మీరించ్చిదేమి లేదు.. మాకు వచ్చే డబ్బుల్నే ఆపారు

తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా.. ఓ చిన్న రిపేర్ కంపెనీ పెట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేశారని, ఏపీలో ఏడు మండలాలు కలిపి తెలంగాణకు తీవ్ర మోసం చేశారన్నారు. దేశానికి కరువొచ్చినా.. దేశానికి అన్నం పెట్టగలిగే స్థాయిలో తెలంగాణ ఉందన్నారు. పేర్లు మార్చి పెట్టుకున్న పథకాలు అన్నింటికీ తెలంగాణే కేంద్ర బిందువు అని మంత్రి పేర్కొన్నారు.

Read Also: Richest Cricketer: ఇండియాలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా.. ఎన్ని కోట్లంటే..!

కర్ణాటక రాష్ట్రంలో అత్యంత అవినీతి చేసింది బీజేపీ ప్రభుత్వమేనని అక్కడి ప్రజలు ఆరోపించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రూ. 80 కోట్ల బీసీలు మోడీ ప్రధాని అయితే సంతోషపడ్డారు.. కానీ బీసీ మంత్రిత్వ శాఖ లేని ప్రభుత్వం మోడీదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అవినీతి జరిగి ఉంటే ఇన్ని అద్భుత పథకాలు ఎలా వస్తాయని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

Exit mobile version