ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్లో సూపర్ ‘హిట్’ యాక్టర్ శ్రీనాథ్ మాగంటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) సినిమాకు సీక్వెల్ వస్తుందనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తోంది, కానీ తాజాగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చింది. మొదటి భాగంలో ‘కార్తీక్’ పాత్రలో మెప్పించిన నటుడు సుశాంత్ రెడ్డి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ సీక్వెల్లో నటించడం లేదని తరుణ్ వెల్లడించాడు. ఈ విషయం తనను ఎంతో బాధించిందని, అసలు సుశాంత్ లేకుండా సినిమా అదే ఫీల్ ఇస్తుందా అని తనే స్క్రిప్ట్‌ను మళ్ళీ విశ్లేషించుకున్నానని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ కథ తన సొంత స్నేహాల నుండి పుట్టినదని, అందుకే ఆ ప్రామాణికతతోనే ముందుకు వెళ్తున్నానని చెప్పారు. సుశాంత్ లేకపోయినా సినిమాలో కార్తీక్ ప్రయాణం మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Also Read : Faria Abdullah : యంగ్ కొరియోగ్రాఫర్‌తో ఫరియా అబ్దుల్లా డేటింగ్!
Also Read
ఇదే సమయంలో ‘హిట్’ ఫ్రాంచైజీ, ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు శ్రీనాథ్ మాగంటి ఈ సీక్వెల్లో ఒక ప్రధాన పాత్ర పోషించబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సుశాంత్ ప్లేస్‌లో శ్రీనాథ్ ‘కార్తీక్’ పాత్రను చేస్తారా లేక ఏదైనా కొత్త పాత్రలో కనిపిస్తారా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. శ్రీనాథ్ ఇప్పటికే ‘యానిమల్’ వంటి భారీ బాలీవుడ్ చిత్రంలో కూడా నటించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇక సుశాంత్ మిస్ అవుతున్నా, ‘ద బాయ్స్’ గ్యాంగ్ మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్‌లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?