సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు విపరీతమైన అభిమానులున్నారు. తమిళం, తెలుగు, హిందీ, జపాన్, థాయ్‌లాండ్ వంటి అనేక దేశాల్లో రజినీ సినిమాలకి అపారమైన క్రేజ్ ఉంది. ఏడు పదుల వయసులో కూడా రజినీకాంత్ తన ఎనర్జీతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే తాజాగా ఒక పాత విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే, ఒకప్పుడు స్టార్ హీరోయిన్ రజినీకాంత్ కోసం ఏకంగా ఏడు రోజుల పాటు ఉపవాసం చేశారట.
Also Read : Ravi Teja : ‘కిక్3’ తో మాస్ మహారాజా రీఎంట్రీ?
ఆమె ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి.. తెలుగు, తమిళం, హిందీ తో సహా పలు భాషల్లో నటించి స్టార్ బ్యూటీ గా ఎదిగారు. బాల నటిగా మొదలుపెట్టి తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వంటి లెజెండ్స్‌తో కలిసి నటించి మెప్పించారు. ఇక శ్రీదేవి, రజినీకాంత్ ఇద్దరు కలిసి దాదాపు 20 సినిమాల్లో నటించడమే కాకుండా, రియల్ లైఫ్‌లో కూడా మంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే ఒకానొక సందర్భంలో రజినీకాంత్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ శ్రీదేవి అమ్మవారి ఉపవాసం చేశారట. ఏడు రోజులు ఆమె ఆహారం తీసుకోకుండా రజినీకాంత్ కోసం ప్రార్థించారట. ఈ విషయాన్ని వారి సన్నిహితులు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించగా, ఇందుకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది శ్రీదేవికి రజినీకాంత్ మీద ఉన్న అభిమానం ఎంత గొప్పదో తెలియజేస్తుంది.
