NTV Telugu Site icon

Naga Shourya : నాగశౌర్య కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ.. డైరెక్టర్ ఎవరంటే ?

New Project (92)

New Project (92)

Naga Shourya : టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్యకు ఈ మధ్య నాగశౌర్యకు పెద్దగా కలిసి రావడం లేదనే చెప్పాలి. ఒకప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు, హిట్స్‌తో అలరించిన ఈ హీరో ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించాడు. దీంతో ప్రస్తుతం ఈ హీరో మంచి సాలీడ్‌ హిట్‌ కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో చివరగా ‘రంగబలి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ చిత్రం నాగశౌర్యను దారుణంగా డిసప్పాయింట్‌ చేసింది. దీంతో నాగశౌర్య కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఆయన కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. నాగ శౌర్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వైవిధ్య భరితమైన కథాంశంతో చిత్రం రూపొందనుంది. ఈ సినిమాతో నాగశౌర్య సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈరోజు(శనివారం) నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

Read Also:Uppu Kappurambu : హీరో సుహాస్ ను అలా పట్టుకుని ఫోజ్ ఇచ్చిన కీర్తి సురేష్


సినిమా నిర్మాణంపై మక్కువ ఉన్న వ్యాపారవేత్త చింతలపూడి శ్రీనివాసరావు నాణ్యమైన చిత్రాలను నిర్మించి కొత్త టాలెంట్‌ని తెరపైకి తీసుకురావాలనే తపనతో పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అతను రమేష్ కథ చెప్పిన కథకు ముగ్ధుడయ్యాడు. మొదటి సినిమానే పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. రమేష్‌కి ఏడేళ్లుగా స్నేహితుడిగా పరిచయం ఉన్న నాగశౌర్యను కథానాయకుడిగా ఎంచుకున్నాడు. రమేష్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవిఎస్ చౌదరి, శ్రీను వైట్ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. అనేక హిట్ సినిమాలకు అసిస్టెంట్ రైటర్ గా పనిచేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఈ చిత్రంలో సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్‌ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పనిచేస్తుండగా, హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

Read Also:Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది..

Show comments