Danushka Gunathilaka: లైంగిక వేధింపుల కేసులో శ్రీలంక బ్యాటర్ దనుష్క గుణతిలకకు బెయిల్ మంజూరు అయింది. అతను సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించకుండా నిషేధించబడ్డాడని తెలుస్తోంది. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు దనుష్కపై ఆరోపణలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో సిడ్నీలోని ససెక్స్ హోటల్‌లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ టీమ్‌లో ఉన్న లంక క్రికెటర్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Koo: ట్విట్టర్‌కు పోటీగా స్వదేశీ యాప్ .. అమెరికాలో లాంచ్ కానున్న “కూ”
31 ఏళ్ల గుణతిలక నవంబర్ 2వ తేదీన 29 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించినట్లు పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 29వ తేదీన డేటింగ్ యాప్ ద్వారా ఆ మహిళ గుణతిలకకు పరిచయం అయ్యింది. దనుష్కపై నాలుగు అభియోగాలు నమోదు చేశారు. ఇష్టం లేకుండా లైంగిక చర్యకు పాల్పడినట్లు అతనిపై కేసు బుక్ చేశారు. టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ స్టేజ్‌లో నమీబియాతో మ్యాచ్‌లో గుణతిలక ఆడాడు. లంక జట్టు తరపున దాదాపు వందకుపైగా అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. లోకల్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడం వల్ల సుప్రీంను ఆశ్రయించగా బెయిల్ లభించింది. తాజా కేసు మళ్లీ జనవరి 12న విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.