ఐపీఎల్ 16 సీజన్ ప్రారంభం నుంచి ఒక్క విజయం కూడా లేకుండా ఉన్నా సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు బోణీ కొట్టింది. నేడు సొంత గడ్డపై ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించించి. ఐపీఎల్ 16వ సీజన్ 14 వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ సొంత గ్రౌండ్‌లో గెలుపే లక్ష్యంగా పోరాడింది. దీంతో శిఖర్ ధావన్ సేనను ఓడించింది. అయితే.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ (91) అర్ధ సెంచరీతో చెలరేగడంతో పంజాబ్ కింగ్స్ 143 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. ఓవైపు వికెట్లు పడుతున్నా పంజాబ్ సారథి ధావన్ ఒంటరి పోరాటం చేశాడు.
Also Read : SRH vs PBKS: నిదానంగా ఆడుతున్న హైదరాబాద్.. 10 ఓవర్లలో స్కోరు ఇది
సామ్ కరన్(22), శిఖర్ ధావన్ (33) నాలుగో వికెట్‌కు 41 రన్స్ జోడించారు. సికిందర్ రజా(5), షారుక్ ఖాన్(4) విఫలమయ్యారు. అయితే.. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రాహుల్ త్రిపాఠి (48 బంతుల్లో 74 నాటౌట్) , ఐడెన్ మార్ర్కమ్(21 బంతుల్లో 37 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 99 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో మయాంక్ మార్కండే నాలుగు వికెట్లు తీశాడు. మార్కో జాన్‌సేన్, ఉమ్రాన్ మాలిక్ తలా రెండు వికెట్లు కూల్చారు. భువనేశ్వర్ కుమార్‌కు ఒక వికెట్ దక్కింది.
Also Read : Talasani Srinivas : సినీ పరిశ్రమకు ఎప్పుడు సహాయం చేయడానికి ముందుంటాం